NTV Telugu Site icon

Uttam Kumar Reddy : జలాశయాలలో పూడిక తీత పనులను పకడ్బందీ ప్రణాళికతో చేపట్టాలి

Uttamkumar Reddy

Uttamkumar Reddy

సచివాలయంలో జలాశయాల పూడిక తీత పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. చైర్మన్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటి పారుదల, రెవిన్యూ, ఖనిజాభివృద్ది శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో నీటి పారుదల జలాశయాలలో పూడిక తీత పనులను పకడ్బందీ ప్రణాలికతో చేపట్టాలన్నారు. జలాశయాలలో పూడిక తీత పనులను ఈపీసీ విధానంలో చేపడితే నిర్ణయించిన సమయానికి పనులు పూర్తి అవుతాయన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. అంతర్జాతీయ స్థాయిలో కాంట్రాక్టర్లు ఆహ్వానించి గ్లోబల్ టెండర్లు పిలిచి పనులను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని, ఖనిజాభివృద్ది సంస్థ జలాశయాలలో ఉన్న ఇసుక, మట్టి నిల్వలను అంచనా వేసి మంచి రేవేవ్యూ ప్రభుత్వానికి వచ్చేలా అంచనాలు రూపొందించాలన్నారు.

జలాశయాలలో ఉన్న ఇసుక, మట్టి ఖనిజాలు ద్వారా వచ్చే ఆదాయంతో రిజర్వాయర్ల నిర్వహణ పనులను చేపట్టాలని, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అన్ని జలాశయాలలో పూడిక తీత పనులను చేపట్టి అత్యంత వేగంగా పనులు పూర్తి చేయాలన్నా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా పూడిక తీత పనులు జరిగేలా చూడాలని, అన్ని శాఖల అదికారులు సమన్వయంతో పనులు చేపట్టి జలాశయాలలో పూడికతీత పనులను విజయవంతంగా పూర్తి చేసి జలాశయాలలో నీటి నిల్వలు పెరిగేలా కృషి చేయాలన్నారు. జలాశయాలు పటిష్టంగా వ్యవసాయానికి మరింత ఉపయోగకరంగా ఉండేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.