NTV Telugu Site icon

Uttam Kumar Reddy : ప్రారంభోత్సవానికి సిద్దంగా సీతారాం ప్రాజెక్ట్ మూడు పంప్ హౌస్లు

Uttam

Uttam

ప్రారంభోత్సవానికి సీతారాం ప్రాజెక్ట్ మూడు పంప్ హౌస్లు సిద్దంగా ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆగస్ట్ 15 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవమని, ఈ ఆదివారం రోజున ట్రయిల్ రన్ కు ఏర్పాట్లు చేశామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. పంప్ హౌజ్ ల ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సీతారామ ప్రాజెక్ట్ అనుమతులు చేరాయి. సీతారామ ప్రాజెక్ట్ కు 67 టీఎంసీ నీటి కేటాయింపులకు ప్రతిపాదనలు. డిస్ట్రీబ్యూటరీల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. 3.40 ఏకరాల ఆయకట్టుకు స్థిరీకరణతో పాటు కొత్తగా సేద్యంలోకి 2 లక్షల 60 వేల ఆయకట్టు, విశ్లేషణాత్మక ప్రణాళికతో ముందడుగు పడినట్లు తెలిపారు. 1, 2 ప్యాకేజీలకు సరిపడా భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

 Vinod Kambli: దేవుడి దయతో అంత ఓకే.. వినోద్ కాంబ్లీ హెల్త్ అప్‌డేట్‌..

మూడు వేల ఎకరాలు సేకరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్జీటితో పాటు సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర అడవులు పర్యావరణ శాఖతో సంప్రదింపులకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైల్వే క్రాసింగ్ లు కాలువల నిర్మాణాలకు ఆటంకం కలుగ కుండా చూడాలని, 34.561,37.551 కిలోమీటర్ల వద్ద ఉన్న రైల్వే క్రాసింగ్ లపై ఆ శాఖతో సంప్రదింపులు జరపాలన్నారు.
Konda Vishweshwar Reddy : దేశాన్ని అభివృద్ధి పంథాలో నడిపేలా కేంద్ర బడ్జెట్ ఉంది