NTV Telugu Site icon

Uttam Kumar Reddy : పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తాం

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

పాలమూరు రంగారెడ్డ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన నాగర్ కర్నూల్ జిల్లాలో మాట్లాడుతూ.. వచ్చే ఆరు నెలల్లోపు ఉదండాపూర్, బీమా, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో గత ప్రభుత్వం 22,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా నీరందించలేదని, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వంటి పెండ్లి ప్రాజెక్టులను 10 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదన్నారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. నీటిపారుదల శాఖను గత ప్రభుత్వం అన్ని విధాల నిర్వీర్యం చేసిందని, 1.8 లక్షల కోట్లు ఖర్చు చేసి నామమాత్రం ఆయకట్టును స్థిరీకరించింది గత ప్రభుత్వమని ఆయన మండిప్డడారు. ఎక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును స్థిరీకరించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు మీరు అందించి సస్యశ్యామలం చేస్తామని ఆయన అన్నారు.

Vettaiyan-The Hunter: ‘వేట్టయన్’ ర‌జినీకాంత్‌ దిగాడు.. అంచనాలు రేపుతున్న ప్రివ్యూ వీడియో