Site icon NTV Telugu

Uttam Kumar Reddy : నెల రోజుల పాలనలో ప్రజలకు మరింత దగ్గరయ్యాం

Uttamkumar Reddy

Uttamkumar Reddy

నెల రోజుల పాలనలో ప్రజలకు మరింత దగ్గరయ్యామన్నారు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటి పారుదల శాఖలో జవాబుదారీ, పారదర్శకంగా పని చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రజా పాలన అంటే ఎలా ఉండాలో నెల రోజుల్లోనే చేసి చూపించామని, ప్రజలు తెలంగాణ లో కొత్తగా స్వాతంత్రం వచ్చినట్టు భావిస్తున్నారు. ఒక నియంత పాలన అంతమైందన్న ఆనందంలో ఉన్నారన్నారు. ప్రజలకు పాలకులు, అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని, తెలంగాణ ప్రజలు ప్రభుత్వం నుంచి ఎలాంటి పాలన ఆశిస్తున్నారో అది వారికి అందుతుందని ఆయన వెల్లడించారు. నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ లో అనేక సమీక్షలు చేసామని, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్, మెడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం లాంటి అంశాలలో సమీక్ష చేసాము. జ్యూడిషియల్ ఎంక్వరీ కోసం ఒక సిట్టింగ్ జడ్జి ని నియమించాలని కోరామన్నారు.

 

మేడిగడ్డ కూలిపోవడం పై కాళేశ్వరం పై ఉన్నతాధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాము.. ప్రజలకు, మీడియా వాళ్లకు వాస్తవాలు తెలియజేశామన్నారు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలసి వెళ్లి కేంద్ర జల శక్తి మంత్రిని కలసి విజ్ఞప్తి చేసామని, రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించేందుకు అన్ని రకాలుగా చర్యలు చెప్పడం జరిగిందన్నారు. పౌరసరఫరా శాఖలో 58 వేళా కోట్ల రూపాయల అప్పులు పేరుకు పోయాయి. పేదలకు ఇస్తున్న బియ్యం కిలో 38 రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రజలకు ఉపయోగం లేకుండా పోతుంది. దీన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగ పడేలా చర్యలకు ఉపక్రమించామని, నెల రోజుల పాలన అత్యంత సంతృప్తిని ఇచ్చింది. నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ లో అత్యంత పారదర్శకంగా పారదర్శకంగా, జవాబు దారి తనంతో పని చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు.

Exit mobile version