NTV Telugu Site icon

Uttam Kumar Reddy : అతి త్వరలో కొత్త రేషన్ కార్డులు

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

అతి త్వరలో కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎల్లుండి జరిగే కేబినెట్ మీటింగ్ లో విధివిధానాలు ఖరార చేయనున్నట్లు ఆయన తెలిపారు. రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తామని ఆయన తెలిపారు. అర్హులందరికీ త్వరలోనే రేషన్‌ ​కార్డులు ఇస్తామని ఉత్తమ్ ​కుమార్​ రెడ్డి పేర్కొన్నారు. తెల్ల రేషన ​కార్డు ఉన్నవారందరికీ రూ.500 సిలిండర్​ ఇస్తామని స్పష్టం చేశారు ఉత్తమ్‌. అసెంబ్లీలో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ రేషన్​ కార్డుపై అడిగిన ప్రశ్నకు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి సమాధానం చెప్పారు. ఇవాళ పౌరసరఫరాలశాఖ పద్దులపై వాడివేడి చర్చలు జరుగుతున్నాయి.

  CM Chandrababu: దళితులకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు చేపట్టండి..

కొత్త రేషన్​ కార్డులు ఎప్పుడు ఇస్తారు : కేసీఆర్​ చర్యలతో రాష్ట్రంలో ధాన్యం గణనీయంగా పెరిగిందని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ తెలిపారు. పౌరసరఫరాల శాఖ ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయలేదని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల కోసం గ్లోబల్​ టెండర్లు ఎందుకు పిలవలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సన్నబియ్యం టెండర్లు రద్దు చేశారా? లేదా అని ప్రశ్నలు వేశారు. కొత్త రేషన్​ కార్డులు అన్నారు, ఎప్పుడు ఇస్తారని అడిగారు. కరీంనగర్​ పర్యాటక ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి పూర్తి చేయాలని కోరారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోస్తే సాగు, తాగునీటి ఇబ్బందులు రావని మాజీ మంత్రి గంగుల కమలాకర్​ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. శాసనసభలో సోమవారం నుంచి గరంగరం

 Delhi: ఆగస్టు 2, 3 తేదీల్లో రాష్ట్రపతి అధ్యక్షతన గవర్నర్ల సదస్సు