Site icon NTV Telugu

MP Uttam Kumar Reddy : కర్నాటకలో కాంగ్రెస్ నాయకులు కలిసి పని చేశారు.. అది పార్టీకి బలం

Uttamkumar Reddy

Uttamkumar Reddy

కన్నడ రాజకీయాలు మలుపు తీసుకున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ను తిరగరాస్తూ.. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రానుంది. అయితే.. కర్ణాటక కాంగ్రెస్‌ విజయాని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటకలో కాంగ్రెస్ నాయకులు కలిసి పని చేశారన్నారు. అది పార్టీకి బలమని.. బీజేపీ అవినీతి ని కర్నాటక ప్రజలు సహించలేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో జనంలోకి బాగా వెళ్ళిందని, తెలంగాణ లో కాంగ్రెస్ కి కలిసి వస్తోందన్నారు.

Also Read : Urinal Problem : మూత్ర విసర్జన సమయంలో నొప్పి? కారణం తెలుసుకో..

తెలంగాణ లో బీజేపీ లేదని, పోటీ బీఆర్‌ఎ.. కాంగ్రెస్ మధ్యనే అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘నేను ఎప్పుడూ పార్టీ వ్యతిరేకంగా పని చేయలేదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయి.. అవేం పెద్ద సమస్య కాదు. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి పని చేస్తాం. . ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే… అంతర్గతంగా చర్చించుకుంటాం.అందరం కలిసి పని చేస్తాం. ఎవరు అపోహలు పడాల్సిన అవసరం లేదు.’ అని ఆయన ఎన్టీవీతో వ్యాఖ్యానించారు.

Also Read : Telangana BJP: కర్ణాటకలో సీన్‌ రివర్స్‌.. తెలంగాణ కాషాయ నేతలకు షాక్‌..!

Exit mobile version