Site icon NTV Telugu

UstaadBhagatSingh Frist Day Collections : ఉస్తాద్ భగత్ సింగ్ మెుదటి రోజు కలెక్షన్స్.. డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ షాక్

Ustad Bagath Singh

Ustad Bagath Singh

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ అంచనాల మధ్య గురువారం నాడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ – పవర్ స్టార్ కాంబోలో సినిమా కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తెల్లవారుజామున ఆటతో రిలీజ్ అయినా ఈ సినిమా ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. రొటీన్ కథ, కథనం బోర్ కొట్టించింది. దాంతో బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ముఖ్యంగా పక్కనే విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్ 2’ ప్రభావం ఈ సినిమా వసూళ్లపై స్పష్టంగా కనిపించింది.

Also Read : Siddhu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ – సితార ఎంటరైన్మెంట్స్.. సినిమా స్టార్ట్

అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు సుమారు రూ. 48 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆఫ్ లైన్ టికెటింగ్ కాకుండా, ఆన్ లైన్ డేటా ప్రకారం ఇండియా వైడ్ గా ఈ చిత్రం 5,359 షోల ద్వారారూ. 31.86 కోట్లు రాబట్టింది. మొదటి రోజు మొత్తం ఆక్యుపెన్సీ 68.01% గా నమోదైంది. ఆంధ్రా ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ స్టామినాకు తగ్గట్టుగా  వసూళ్లు పర్వాలేదనిపించాయి. ఇక్కడ రూ. 19.40 కోట్లు వసూలు కాగా ఆక్యుపెన్సీ 68.35% గా  నమోదైంది. తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఇక్కడ కేవలం రూ.9.10 కోట్లు మాత్రమే రాబట్టింది. దీనికి ప్రధాన కారణం హిందీ సినిమా ‘ధురంధర్ 2’ వేవ్ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. భారీ అంచనాలతో యూఎస్ మరియు ఇతర దేశాల్లో విడుదలైన ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో ఆశించిన ప్రభావాన్ని చూపలేకపోయింది. ఓవరాల్‌గా మొదటి రోజు ప్రదర్శన అండర్వెల్మింగ్ గానే మిగిలిందని సినీ వర్గాల అభిప్రాయం.

Note : ఈ కలెక్షన్స్ అఫీషియల్ గా ప్రకటించినవి కాదు. వివిధ మార్గాల ద్వారా సేకరించి అందజేస్తున్నాం..

Exit mobile version