Site icon NTV Telugu

Ustaad Bhagat Singh Trailer: ‘ఇది భగత్‌ గీత.. దమ్మున్నొడు దాటొచ్చు’.. ‘ఉస్తాద్’ ఊచకోత!

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh Trailer: పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 19న ఉగాది కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. తాజాగా చిత్ర బృందం ట్రైలర్‌ టీజ్‌ అంటూ ఓ చిన్న వీడియోను రిలీజ్ చేసింది. ‘ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్‌ గీత.. దమ్మున్నొడు దాటొచ్చు’ అంటూ పవన్‌ చెప్పిన డైలాగ్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలు ఊగించేలా ఉన్నాయి. చిత్ర పూర్తి ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

READ ALSO: IDBI Bank JAM Recruitment 2026: IDBIలో 1300 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. ఎలిజిబిలిటీ, ఫీజు వివరాలు

ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిజానికి మార్చి 26న విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా, యష్ ‘టాక్సిక్’ వాయిదా పడటంతో వారం ముందే థియేటర్లలోకి రాబోతుంది. శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు. తమన్ కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) పనుల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.

READ ALSO: President Murmu: పశ్చిమ బెంగాల్‌లో ప్రోటోకాల్ ఫైట్.. మమతా బెనర్జీ సర్కార్‌ను ఏకిపారేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!

Exit mobile version