Site icon NTV Telugu

UstaadBhagatSingh Review : ఉస్తాద్ ఓవర్శీస్ రివ్యూ.. ఇలా అయితే ఎలా హరీష్

Ustad Bhagath Singh

Ustad Bhagath Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో దశాబ్దం తర్వాత వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కాగా నేడు ఉదయం ప్రీమియర్ షోస్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ  సినిమా చూసిన ఆడియెన్స్ నుండి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఒక కమర్షియల్ సినిమాకు అద్భుతమైన కథ ఉండక్కర్లేదు కానీ, కనీసం కథనంలో అయినా కొత్తదనం ఉండాలి. కానీ ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు రొటీన్ కథతో సాగిందని కొన్ని చోట్ల హీరో ఎలివేషన్ సీన్లు మాస్ ఆడియన్స్‌ను అలరించినప్పటికీ సినిమా మొత్తంగా చూస్తే ఒక ఫ్లో అనేది కనిపించదు. ఏదో కొన్ని సీన్లను కలిపి ఒకచోట కుట్టినట్లుగా అనిపిస్తుంది తప్ప, ఒక పవర్ స్టార్ సినిమా చూస్తున్న అనుభూతి కలగదని ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్.

ఇక దర్శకుడు హరీష్ శంకర్ తన మార్క్ కామెడీ మరియు కమర్షియల్ డైలాగ్స్‌తో మ్యాజిక్ చేయడంలో ఈసారి విఫలమయ్యారు. గత సినిమాల్లో ఉన్నంత కామెడీ ఇందులో ఎక్కడా కనిపించదు. ఇక సంగీత దర్శకుడు థమన్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను లేపడానికి ప్రయత్నించినప్పటికీ, అసలు కథలోనే బలం లేకపోవడంతో తన వంతుగా ఎదో చేయాలని ప్రయత్నించాడు. సినిమాలో పవన్ కళ్యాణ్ కొన్ని సీన్లలో ఆకట్టుకున్నప్పటికీ, ఆయన ట్రేడ్ మార్క్ ఎనర్జీ మాత్రం అక్కడక్కడా మిస్ అయినట్లు అనిపిస్తుంది. మొత్తానికి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎటువంటి కొత్తదనం లేని బోర్ కొట్టించే ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మిగిలిపోయిందని ఓవర్సీస్ నుండి వచ్చిన టాక్. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎలాంటి టాక్ తెచుకునుందో చూడాలి.

Exit mobile version