Site icon NTV Telugu

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ ‌సింగ్’ క్రేజీ అప్డేట్ లోడింగ్

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

Pawan Kalyan: ఓజీ సినిమాతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్ట్స్ సినిమా కోసం రంగంలోకి దిగారు. పవన్ అభిమానులలోనే కాకుండా, సినిమా ప్రేక్షకులలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యా్ణ్- డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్‌సింగ్ ఎంతటి హిట్ సినిమానో తెలిసిందే. తాజాగా ఈ హీరో – డైరెక్టర్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినిమా అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజీ కాంబో తెరకెక్కుతున్న సినిమా నుంచి త్వరలో ఒక సూపర్ అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

READ ALSO: Crime News: నాగార్జునసాగర్ కుడి కాలువలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య..

తాజాగా ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డ్యాన్స్ ఫ్లోర్‌పై డ్యాన్స్ చేస్తున్న వీడియో క్లిప్‌ను పంచుకుంది. అలాగే అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. పవర్‌స్టార్ సందడి‌తో ఉస్తాద్ డిసెంబర్‌ వేడుకలు ప్రారంభం అయినట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేకింగ్ వీడియోలో పవర్‌స్టార్ ‌పవన్‌ కళ్యాణ్‌ స్టైల్‌, ఎనర్జీ, మాస్‌ అటిట్యూడ్‌‌ను ప్రతిబింబించేలా సాంగ్‌ను రూపొందించినట్లు కనిపిస్తుంది. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. పవన్‌–డీఎస్పీ కాంబినేషన్‌లో ఇప్పటివరకు వచ్చిన పాటలన్నీ సూపర్‌ హిట్‌ కావడంతో, ఈ కొత్త సింగిల్‌పై ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులలో మరింత హైప్‌ ఏర్పడింది. ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా కీ రోల్స్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఆనంద్‌సాయి పనిచేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. డిసెంబర్‌ నెల మొత్తం ఈ చిత్ర బృందం “ఉస్తాద్‌ భగత్‌సింగ్‌” ప్రమోషన్స్‌తో సందడి చేయనున్నట్లు సమాచారం.

READ ALSO: Female Suicide Bomber: జాకెట్‌లో బాంబులు.. మహిళా ఆత్మాహుతి బాంబర్ ఫోటో రిలీజ్ చేసిన పాక్

Exit mobile version