Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్రేజీ అప్డేట్ లోడింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఓజీ సినిమాతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్ట్స్ సినిమా కోసం రంగంలోకి దిగారు. పవన్ అభిమానులలోనే కాకుండా, సినిమా ప్రేక్షకులలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యా్ణ్- డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్‌సింగ్ ఎంతటి హిట్ సినిమానో తెలిసిందే. తాజాగా ఈ హీరో – డైరెక్టర్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినిమా అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజీ కాంబో తెరకెక్కుతున్న సినిమా నుంచి త్వరలో ఒక సూపర్ అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
READ ALSO: Crime News: నాగార్జునసాగర్ కుడి కాలువలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
తాజాగా ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డ్యాన్స్ ఫ్లోర్‌పై డ్యాన్స్ చేస్తున్న వీడియో క్లిప్‌ను పంచుకుంది. అలాగే అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. పవర్‌స్టార్ సందడితో ఉస్తాద్ డిసెంబర్ వేడుకలు ప్రారంభం అయినట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేకింగ్ వీడియోలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్, ఎనర్జీ, మాస్ అటిట్యూడ్‌ను ప్రతిబింబించేలా సాంగ్‌ను రూపొందించినట్లు కనిపిస్తుంది. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్–డీఎస్పీ కాంబినేషన్‌లో ఇప్పటివరకు వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ కావడంతో, ఈ కొత్త సింగిల్‌పై ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులలో మరింత హైప్ ఏర్పడింది. ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా కీ రోల్స్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా ఆనంద్‌సాయి పనిచేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. డిసెంబర్ నెల మొత్తం ఈ చిత్ర బృందం “ఉస్తాద్ భగత్‌సింగ్” ప్రమోషన్స్‌తో సందడి చేయనున్నట్లు సమాచారం.
READ ALSO: Female Suicide Bomber: జాకెట్‌లో బాంబులు.. మహిళా ఆత్మాహుతి బాంబర్ ఫోటో రిలీజ్ చేసిన పాక్
The energy you love.
The dance you enjoy.
The attitude you celebrate.
The man you worship.All this in one single song envisioned by our CULT CAPTAIN @harish2you 💥💥#UstaadBhagatSingh first single announcement very soon ❤🔥#DeCeMberMonth will be celebrated 🕺🥳
POWER… pic.twitter.com/bMF8CKIRlQ
— Mythri Movie Makers (@MythriOfficial) December 1, 2025
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!