Mother Kills Daughters: ఒక వర్జీనియా మహిళ తన ఇద్దరు కుమార్తెలను హత్య చేసినందుకు దోషిగా తేలింది, దానిలో ప్రాసిక్యూటర్లు తన మాజీ భర్తపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక వక్రీకృత ప్రయత్నమని చెప్పారు. అతను ఒక అమ్మాయిని విడిచిపెట్టాలని అనుకున్నాడు.వెరోనికా యంగ్‌బ్లడ్(37) తన పిల్లలైన 15 ఏళ్ల షారన్ కాస్ట్రో, 5 ఏళ్ల బ్రూక్లిన్ యంగ్‌బ్లడ్‌ను చంపినట్లు అంగీకరించింది. అయితే ఆగస్టు 5, 2018న చేసిన ఈ హత్యలకు తన పిచ్చితనమే కారణంగా ఆమె నేరాన్ని అంగీకరించలేదు. అయితే, హత్యలకు మానసిక అనారోగ్యమే ప్రధాన కారణమని జ్యూరీ నమ్మకపోవడం గమనార్హం. తన కుటుంబ సభ్యులచే శారీరకంగా, లైంగికంగా వేధించబడిందని డిఫెన్స్ న్యాయవాదులు తెలిపిన మాజీ వ్యభిచారి యంగ్‌బ్లడ్‌ను ప్యానెల్ బుధవారం దోషిగా నిర్ధారించింది. ఈ రెండు హత్యలు, ఘోరమైన తుపాకీ వినియోగానికి సంబంధించి శిక్ష విధించినట్లు తెలిసింది.
విచారణ సమయంలో, ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ అసిస్టెంట్ కామన్‌వెల్త్ అటార్నీ కెల్సే గిల్ యంగ్‌బ్లడ్‌ను హానికరమైన, స్వార్థపూరిత, ఉద్దేశపూర్వక కిల్లర్‌గా అభివర్ణించారు. వెరోనికా యంగ్‌బ్లడ్ విచారణ సమయంలో తన చిన్నతనంలో తల్లిదండ్రుల వేధింపులను వివరించి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె తండ్రి ఆమెపై బెల్ట్, చీపురు, కొమ్మతో శారీరకంగా దాడి చేశాడు. అయితే ఆమె చిన్నతనంలో ఆమె తాత తనను లైంగికంగా వేధించాడని జ్యూరీకి తెలిపింది. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో తన తల్లిదండ్రులు తనను, తన సోదరిని విడిచిపెట్టిన తర్వాత, ఆమె వ్యభిచారం పైపు వెళ్లిందని, అక్కడ ఆమె తన మాజీ భర్త రాన్ యంగ్‌బ్లడ్‌ను కలిశానని, అతనితో కలిసి యూఎస్‌కి వెళ్లినట్లు తెలిపింగి. అతను నేవీ పైలట్‌గా విదేశాలలో పనిచేశాడు. కానీ అనంతరం విడిపోయారు. ఈ నేపథ్యంలో “నన్ను ఎందుకు వదలేసావు?” అని ఆమె కోర్టు హాలులో అతనిని అడిగింది. “అమ్మాయిలతో నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేశావు? వదిలేయక పోతే ఇవేవీ జరిగేవి కావు!” అని ఆమె ప్రశ్నించింది. రెండు వారాల పాటు సాగిన ఈ విచారణలో, ప్రాసిక్యూటర్ ఆమె హంతకురాలని, బాధితురాలు కాదని వాదించారు.
Read Also: Witchcraft: చేతబడి నెపంతో ఒంటరి వృద్ధ దంపతులపై దాడి.. ఆ తర్వాత
యంగ్‌బ్లడ్ తన చిన్న కుమార్తెను కాల్చి హత్య చేసిన తర్వాత, తన 15 ఏళ్ల కుమార్తె వెనుక నుంచి ఛాతీపై కాల్చింది. పెద్ద కూతురు షారన్ కాస్ట్రో ఆ సమయంలో 911 నంబర్‌కు కాల్ చేసింది. దయ చేసి సహాయం చేయండి.. తన తల్లి చెల్లిని చంపేసిందని, తనను కూడా చంపేస్తుందని.. నేను చనిపోవాలనుకోవట్లేదు అని అర్థించింది. ఈ హత్యల తర్వాత యంగ్‌బ్లడ్ తన మాజీ భర్తను పిలిచి, “నేను బ్రూక్లిన్‌ని చంపాను. నేను షారోన్‌ని చంపాను. నేను నన్ను చంపుకోబోతున్నాను. నేను నిన్ను ద్వేసిస్తున్నాను. బై.” అని హెచ్చరించింది. దీనికి సంబంధించిన రికార్డింగ్‌ను అధికారులు కోర్టులో వినిపించారు. విచారణ రెండు వారాల పాటు కొనసాగింది. ఆమెను దోషిగా ప్రకటించడానికి జ్యూరీకి ఒక రోజు పట్టింది.