Site icon NTV Telugu

US-Iran War: హార్ముజ్ వద్ద అమెరికా బిగ్ ఆపరేషన్.. ఇరాన్ క్షిపణి కేంద్రాలపై ఎయిర్ స్ట్రైక్స్

Us Strikes Iran

Us Strikes Iran

US-Iran War: మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ఓవైపు ఇరాన్, మరోవైపు అమెరికా- ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు రోజు రోసజుకూ పెరగుతున్నాయి. తాజాగా అమెరికా ఇరాన్‌ క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు చేసింది. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) జలసంధి సమీపంలోని ఇరాన్ క్షిపణి కేంద్రాలపై విరుచుకు పడింది. ఈ దాడిలో ఏకంగా 5,000 పౌండ్ల బరువున్న బంకర్-బస్టర్ బాంబులను (Bunker-buster bombs) ఉపయోగించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ నేడు ప్రకటించింది. ఈ క్షిపణి భూగర్భంలో ఉన్న లక్ష్యాలను ఈజీగా ఛేదించగలదు. తీర ప్రాంతంలోని భూగర్భంలో ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలను నాశనం చేసేందుకే ఈ ఆధునిక ‘డీప్ పెనెట్రేటర్’ మందు గుండు సామగ్రిని వాడినట్లు యూస్ వెల్లడించింది. ఈ దాడుల్లో కీలక విజయం సాధించామని, ఇరాన్ యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులను నాశనం చేసినట్లు ప్రకటించింది.

READ MORE: Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో ‘మిధున రాశి’ ఫలితాలు.. అప్పటి వరకు మాట అదుపులో ఉంచుకోవాల్సిందే.!

ఇదిలా ఉండగా.. తాజాగా నాటో (NATO – North Atlantic Treaty Organization)దేశాలపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలకు రక్షణగా తమ యుద్ధ నౌకలను పంపాలని డోనాల్డ్ ట్రంప్ కోరారు. ఈ అంశంపై స్పందించిన నాటో ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. యుద్ధం ముగిసే వరకు తమ నౌకలను పంపే ప్రసక్తే లేదని మిత్ర దేశాలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్రంపునకు వ్యతిరేకంగా ప్రకటన చేశారు. పరిస్థితులు చక్కబడే వరకు తమ నౌకలను పంపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటన అనంతరం ట్రంప్ స్పందించారు. “నాటో పెద్ద తప్పు చేస్తోంది. మాకు ఎవరి సహాయం అవసరం లేదు, ఇరాన్‌ను ఒంటరిగానే ఎదుర్కోగలము” అని ధీమా వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొన్ని గంటలకే ‘స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) జలసంధి సమీపంలోని ఇరాన్ క్షిపణి కేంద్రాలపై అమెరికా విరుచుకుపడటం గమనార్హం.

READ MORE: Chris Gayle IPL Record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ నంబర్ వన్‌గా గేల్.. రోహిత్, కోహ్లీ, ధోనీలకు కష్టమే!

Exit mobile version