NTV Telugu Site icon

Red Sea Crisis: హౌతీ రెబల్స్ నియంత్రణలో ఉన్న మరో స్థావరంపై యూఎస్ సైన్యం దాడి

Us

Us

Houthi rebels: ఎర్ర సముద్రంలో యుద్ధం జరిగే అవకాశం ఉంది. హౌతీలపై అమెరికా దాడి కొనసాగుతుంది. యెమెన్‌లో హౌతీ బలగాలపై అమెరికా బలగాలు అదనపు దాడిని జరుపుతున్నాయని అమెరికా అధికారులు తెలిపారు. అంతకు ముందు, ఎర్ర సముద్రం షిప్పింగ్‌పై దాడి చేసే హౌతీ సైన్యం సామర్థ్యాన్ని తగ్గించడానికి అమెరికా దేశంలోని 30 ప్రదేశాలలో ఈ దాడులు చేసింది. అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్చరించారు. హౌతీ సైనిక స్థావరాలపై అమెరికా బలగాలు వాయు, సముద్ర మార్గాల ద్వారా ఉధృతంగా దాడులు చేస్తున్నాయి.

Read Also: Guntur Kaaram: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ డే 1… ఆర్ ఆర్ ఆర్ రికార్డ్స్ కూడా లేచాయ్

ఇక, నిన్న తొలి రోజు 28 చోట్ల దాడులు చేయగా.. 60కి పైగా హౌతీ రెబల్స్ కు చెందిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇక, శనివారం ఉదయం హౌతీలకు చెందిన మరో ప్రదేశాన్ని గుర్తించింది. రాడార్ సైట్.. ఇది ఇప్పటికీ సముద్ర ట్రాఫిక్‌కు ముప్పుగా ఉంది అని ఓ అధికారి తెలిపారు. అంతకుముందు శుక్రవారం నాడు హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని యూఎస్ తో పాటు బ్రిటన్ సైనికులు వైమానిక దాడులు నిర్వహించాయి. యెమెన్ చుట్టూ ఉన్న ఎర్ర సముద్రంతో పాటు ఏడెన్ గల్ఫ్‌లోని ప్రాంతాలను రాబోయే 72 గంటల పాటు తప్పించుకోవాలని యూఎస్ జెండాతో కూడిన నౌకలను అమెరికా నేవీ హెచ్చరించింది. హౌతీలు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తారని తాము భావిస్తున్నామని యూఎస్ మిలిటరీతో పాటు వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు.

Read Also: Lok Sabha Elections: నేడు ఇండియా కూటమి కీలక సమావేశం

కీలకమైన ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన డ్రోన్, క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా యూఎస్ నేతృత్వంలోని వైమానిక దాడిలో ఐదుగురు మరణించాగా, మరో ఆరుగురు గాయపడ్డారని హౌతీలు తెలిపారు. యెమెన్‌లోని హౌతీ నియంత్రణ ప్రాంతాల్లోని 28 వేర్వేరు ప్రాంతాల్లో రెండు దశల్లో దాడులు నిర్వహించినట్లు అమెరికా ప్రకటించింది.