Site icon NTV Telugu

US President Son: అమెరికా అధ్యక్షుడి కొడుకుకి జైలు శిక్ష..!

Baiden

Baiden

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌ కొడుకు హంటర్‌ బైడెన్‌ తనపై నమోదైన రెండు కేసుల్లో నేరం అంగీకరించేందుకు ముందుకు వచ్చాడు. కాగా, ఆయనపై ఆదాయ పన్ను ఎగవేతతో పాటు అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్నారనే అభియోగాలు ఉన్నాయి. దీనిపై ఆయన రియాక్ట్ అవుతూ నేరాలను ఒప్పుకున్నారు.

Read Also: Rashmika: ఈ సినిమాతో నార్త్ లో నేషనల్ క్రష్ సెటిల్ అయిపోవాల్సిందే

ఇందుకు సంబంధించిన కేసుల్లో న్యాయశాఖతో ఒప్పందం కుదుర్చుకునేందుకు హంటర్ బైడెన్ సిద్ధంగా ఉన్నారంటూ డెలావెర్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఫెడరల్‌ జడ్జి ఇంకా ఆమోదం తెలప లేదు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ హంటర్‌ బైడెన్‌ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో, బైడెన్‌కు ఇది ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. మరోవైపు దీన్ని అనుకూలంగా తీసుకున్న ప్రత్యర్థి పార్టీ బైడెన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది.

Read Also: Honey Health Benefits: తేనెను ఇలా తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

అయితే, హంటర్‌ బైడెన్‌కు ఇతర దేశాల నుంచి అక్రమ లావాదేవిలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. 2018లో డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్నారని మరో కేసు నమోదయ్యింది. 2018లో ఖరీదు చేసిన ఓ ఆయుధానికి సంబంధించ ఆయన సమాచారం ఇవ్వకపోవడంతో.. ఈ రెండు కేసుల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఒకవేళ అవి నిరూపితమైతే హంటర్ బైడెన్ కు పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.

Read Also: MLA And Engineer: ఇంజినీర్ చెంప చెల్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే..

ఇక.. హంటర్‌ బైడెన్‌ వ్యవహారంపై వైట్‌హౌస్‌ కూడా రియాక్ట్ అయింది. జో బైడెన్‌ దంపతులు తమ కుమారుడిని ఎంతో ప్రేమిస్తారని.. తన జీవితాన్ని పునర్మించుకునే టైమ్ లో హంటర్‌కు తోడుగా నిలుస్తారని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి ఇయాన్‌ శామ్స్‌ తెలిపారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ విషయం హాట్ టాఫిక్ గా మారింది.

Exit mobile version