Site icon NTV Telugu

US Open 2025: యుఎస్‌ ఓపెన్‌ 2025 విజేతగా బెలారస్‌ భామ.. సెరెనా విలియమ్స్ తర్వాత..!

Aryna Sabalenka

Aryna Sabalenka

యుఎస్‌ ఓపెన్‌ 2025 టైటిల్ విజేతగా బెలారస్‌ భామ అరీనా సబలెంక నిలిచారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో అమెరికా క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్ అమండా అనిసిమోవాను 6-3, 7-6(3) తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నారు. ఒక గంటా 34 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. రెండు సెట్లలోనూ సబలెంక సత్తాచాటారు. 17 ఏళ్ల సబలెంక ఆట ముందు 24 ఏళ్ల అమండా తేలిపోయారు. ఫైనల్‌లో సబలెంక పూర్తి ఆధిపత్యం చెలాయించి విజేతగా నిలిచారు.

అరీనా సబలెంక నాలుగో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నారు. రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లు, రెండు యుఎస్ ఓపెన్‌లను బెలారస్‌ భామ గెలుచుకున్నారు. టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ తర్వాత యుఎస్ ఓపెన్ టైటిల్‌ను (2024 విజేత సబలెంక) కాపాడుకున్న మొదటి క్రీడాకారిణిగా సబలెంక నిలిచారు. ఇగా స్వియాటెక్, నవోమి ఒసాకాను ఓడించి ఫైనల్‌కు చేరుకున్న అనిసిమోవా టాప్ సీడ్ సబలెంకాను మాత్రం ఓడించలేకపోయారు. మరో గ్రాండ్ స్లామ్ గెలవడం సంతోషంగా ఉందని సబలెంక తెలిపారు. ఈ విజయం చాలా గర్వపడుతున్నా అని చెప్పారు.

Also Read: Today Astrology: నేటి దిన ఫలాలు.. ఆ రాశి వారికి అనారోగ్య సమస్యలు!

మరోవైపు యుఎస్‌ ఓపెన్‌ 2025 పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ నేడు జరగనుంది. టాప్‌ సీడ్‌ యానిక్‌ సినర్‌తో రెండో సీడ్‌ కార్లోస్‌ అల్కరాస్‌ అమీతుమీ తేల్చుకోబోతున్నాడు. ఓపెన్‌ శకంలో ఓ సీజన్లో కనీసం మూడు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో అడుగుపెట్టిన తొలి జంటగా సినర్, అల్కరాస్‌ రికార్డుల్లో నిలిచారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ను అల్కరాస్‌ గెలిస్తే.. వింబుల్డన్‌ను సినర్‌ గెలుచుకున్నాడు. నేటి యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Exit mobile version