US Open 2024 Carlos Alcaraz: శుక్రవారం జరిగిన యుఎస్ ఓపెన్ 2024లో పెద్ద పరాభవం ఎదురైంది. నెదర్లాండ్స్ టెన్నిస్ ఆటగాడు బోటిక్ వాన్ డి జాండ్‌స్చుల్ప్ 4 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన కార్లోస్ అల్కరాజ్‌ను ఓడించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. డచ్ ప్లేయర్ జాండ్‌స్చుల్ప్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో 6-1, 7-5, 6-4 తో అల్కరాజ్‌ను వరుస సెట్లలో ఓడించి నిష్క్రమించాడు. 2021 తర్వాత తొలిసారిగా రెండో రౌండ్‌లో అల్కరాజ్ ఓటమిని చవిచూశాడు. ఈ మ్యాచ్ లో జాండ్‌స్చుల్ప్ మొత్తం 49 పాయింట్లు, 22 స్మాషింగ్ షాట్స్ సాధించాడు. ఇద్దరు ఆటగాళ్లు కూడా తలో రెండు ఏస్‌లు సంధించారు. అల్కరాజ్ 27 తప్పులు చేయగా, జాండ్‌స్చుల్ప్ 7 డబుల్ ఫాల్ట్ లను నమోదు చేశాడు. అయితే, జాండ్‌స్చుల్ప్ మ్యాచ్ అంతటా ఆల్కరాజ్ పై ఆధిపత్యం చెలాయించాడు.
Success Story: రూ. 3వేలతో వ్యాపారం.. ప్రస్తుతం నెలకు రూ.70 లక్షల సంపాదన!
ఇక వాన్ డి జాండ్‌స్చుల్ప్ విషయానికి వస్తే.., అతను మూడవ రౌండ్‌లో USA యొక్క జాక్ డ్రేపర్‌తో తలపడతాడు. 2024 ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లలో ఇటీవలి రెండు మేజర్ టోర్నమెంట్ టైటిల్స్ ను కార్లోస్ అల్కరాజ్ గెలుచుకున్న కారణంగా ఈ ఫలితం టెన్నిస్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.