ఒక మనిషిని మరో మనిషి చంపడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఒక్క క్షణం ఆలోచించకుండా చంపేస్తున్నారు. చిన్న చిన్న గొడవలు పడి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అంతేకాకుండా కొందరు వ్యక్తులు తాను హత్య చేసిన ఉదంతాన్ని మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.
అమెరికాలో ఓ దారుణ సంఘటన జరిగింది. ఓ మహిళను పొడిచి చంపిన నిందితుడు.. ఆమె చనిపోయే చివరి క్షణాలను వీడియో తీశాడు. అంతేకాకుండా దానిని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఆ హత్య ఘటనను చూసిన అక్కడున్న ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరోవైపు హత్య చేసిన నిందితుడు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.
Rose Cultivation : కొత్త రకం గులాబీ సాగుతో అధిక లాభాలను పొందవచ్చు..
అయితే హత్య ఘటనను చూసిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫోన్ నంబరు ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. శాన్‌జోస్‌కు చెందిన మార్క్ మెచికోఫ్‌గా గుర్తించారు. మరోవైపు పోలీసుల విచారణలో బాధితురాలు నిందితుడికి ముందే తెలుసని పేర్కొన్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
