NTV Telugu Site icon

Burning Candles: వెలుగుతున్న 150 కొవ్వొత్తులను నోట్లో పెట్టుకున్నాడు.. అనుకున్నది సాధించాడు..

Guinness World Record

Guinness World Record

Burning Candles: గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సాధించేందుకు ఓ వ్యక్తి గొప్ప సాహసమే చేశాడు. ఇంతకీ ఏం చేశారనుకుంటున్నారా?. అమెరికాలోని ఇడాహోకు చెందిన డేవిడ్‌ రష్‌ అనే వ్యక్తి 150 వెలిగించిన కొవ్వొత్తులను 30 సెకన్ల పాటు నోటిలో పెట్టుకుని గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు. డేవిడ్‌ రష్‌ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్ విద్యను ప్రోత్సహించడానికి ఇప్పటికే 250 రికార్డులను బద్దలు కొట్టారు.

తాను గతంలో డెసెంబరులో అదే రికార్డును ప్రయత్నంచానని.. అయితే అతని నోటి నుంచి కొన్ని కొవ్వొత్తులు పడిపోయినందున విఫలమయ్యానని చెప్పాడు. కొవ్వొత్తుల బరువు కారణంగా నోట్లోని కొవ్వొత్తులు జారిపోయాయని డేవిడ్‌ రష్‌ చెప్పారు. ఇప్పుడు కూడా కేవలం 5 సెకన్లు మాత్రమే అవి బయటకు జారిపోతున్నట్లు తాను భావించానని.. అందువల్ల వాటిని గట్టిగా బిగించి వాటిని పడిపోకుండా పళ్లతో కొరికినట్లు అతను చెప్పాడు. ప్రయత్నిస్తున్న సమయం కంటికి కళ్లజోడు ధరించినప్పటికీ.. పొగలు తీవ్రంగా వచ్చాయన్నారు. నోట్లోని లాలాజలం కారణంగా కొవ్వొత్తులు జారే అనిపించాయన్నారు. ఈ రికార్డుకు సంబంధించిన వీడియోను డేవిడ్ రష్‌ స్వయంగా మూడు రోజుల క్రితం యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.”నోటిలో అత్యధికంగా వెలిగించిన కొవ్వొత్తులకు డేవిడ్ రష్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను తిరిగి పొందాడు” అని క్యాప్షన్‌ను జత చేశాడు.

Crime News: చెల్లితో ఎఫైర్.. ‘ఉప్పెన’ సీన్ రిపీట్ చేసిన అన్న

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్ ప్రకారం.. గతంలో ఈ రికార్డు అమెరికాకు చెందిన గారెమ్‌ జేమ్స్‌ పేరిట ఉంది. ఇప్పుడు ఆ రికార్డును డేవిడ్‌ రష్‌ అధిగమించాడు. జేమ్స్‌ జూన్ 25, 2021న నార్త్ కరోలినాలోని షార్లెట్‌లో 105 కాలుతున్న కొవ్వొత్తులను తన నోటిలో ఉంచుకున్నాడు. ఇప్పుడు రష్‌ 150 కొవ్వొత్తులను వెలిగించాడు.