Green Card Holders: గ్రీన్ కార్డ్ హోల్డర్లకు షాక్.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల ఒక కీలక తీర్పును వెలువరించింది. నేరాలకు పాల్పడ్డారనే అనుమానం ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లను దేశంలోకి తిరిగి రాకుండా అడ్డుకోవడం, అలాగే వారిని దేశం నుండి బహిష్కరించే ప్రక్రియను సులభతరం చేస్తూ కోర్టు 6-3 మెజారిటీతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏదైనా నేరపూరిత ఆరోపణలు ఉన్న నివాసితులను సరిహద్దు అధికారులు దేశంలోకి రాకుండా నిలిపివేయడానికి వారిపై పక్కా ఆధారాలు ఉండాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. చైనా పౌరుడైన ముక్ చోయ్ లౌ అనే గ్రీన్ కార్డ్ హోల్డర్ కేసు ఆధారంగా ఈ తీర్పు వచ్చింది. న్యూజెర్సీలో నకిలీ వస్తువుల తయారీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అతను చైనాకు వెళ్లి తిరిగి వస్తుండగా జేఎఫ్‌కే విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అతను కోర్టులో నేరాన్ని అంగీకరించడంతో బహిష్కరణ వేటు పడింది. అయితే తనను అడ్డుకునే సమయానికి అధికారుల వద్ద పక్కా ఆధారాలు లేవని లౌ వాదించగా, సుప్రీంకోర్టు దానిని తోసిపుచ్చింది.
గతంలో గ్రీన్ కార్డ్ హోల్డర్లను విమానాశ్రయాల్లో నిలిపివేయాలంటే వారు నేరం చేశారనేందుకు బలమైన ఆధారాలు చూపాల్సి వచ్చేది. కానీ తాజా తీర్పు ప్రకారం.. కేవలం అనుమానం లేదా దొంగతనం, మోసం వంటి నైతిక పతనానికి సంబంధించిన నేరారోపణలు ఉంటే చాలు, అధికారులు వారిని సాధారణ ప్రయాణికులుగా కాకుండా కొత్తగా దేశంలోకి ప్రవేశం కోరే ‘దరఖాస్తుదారులు’గా పరిగణించవచ్చు. దీనివల్ల అధికారులకు వారిని వెంటనే అదుపులోకి తీసుకునే లేదా దేశ బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించే అధికారం లభిస్తుంది. నేరం రుజువైందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా, పెండింగ్ కేసుల ఆధారంగానే అధికారులు చర్యలు తీసుకోవచ్చు. ఇలాంటి స్థితిలో తమకు దేశంలోకి ప్రవేశించే అర్హత ఉందని నిరూపించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా సదరు వ్యక్తిపైనే ఉంటుంది.
Also Read
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ఈ తీర్పుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేరం నిరూపితమయ్యే వరకు ఎవరైనా అమాయకులేననే ప్రాథమిక సూత్రానికి ఇది విరుద్ధమని, కేవలం ఆరోపణల ఆధారంగా గ్రీన్ కార్డ్ రక్షణలను తొలగించడానికి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఒక ‘బ్లాంక్ చెక్’ ఇచ్చినట్లయిందని అసమ్మతి తెలిపిన న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కొత్త నిబంధనల వల్ల అమెరికాలో ఉంటున్న భారతీయ సంతతి ప్రజలపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. ప్రస్తుతం దాదాపు 65 లక్షల మందికి పైగా భారతీయ సంతతి వ్యక్తులు అమెరికాలో నివసిస్తున్నారు. వారిలో గ్రీన్ కార్డ్ కలిగి ఉండి, ఏవైనా చిన్నపాటి చట్టపరమైన సమస్యలు లేదా పెండింగ్ కేసులు ఉన్నవారు విదేశీ ప్రయాణాలు చేసి తిరిగి అమెరికా వచ్చేటప్పుడు సరిహద్దుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?