Site icon NTV Telugu

Monkeypox in Children : తొలిసారిగా పిల్లల్లో మంకీపాక్స్‌ గుర్తింపు

Monkeypox In Children

Monkeypox In Children

Monkeypox in Children : అమెరికాలో మంకీపాక్స్ వ్యాధిని మొదటిసారిగా పిల్లల్లో గుర్తించారు. కాలిఫోర్నియాలోని ఇద్దరు పసిపిల్లలకు మంకీపాక్స్ సోకిందని యూఎస్ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఈ రెండు మంకీపాక్స్ కేసులు గృహ ప్రసారం ఫలితంగా ప్రబలి ఉండవచ్చని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఒక ప్రకటనలో తెలిపింది. చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారని, వారికి చికిత్స అందిస్తున్నామని వైద్యాధికారులు చెప్పారు. ఇటీవల వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్ పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో పురుషులతో లైంగిక సంబంధం ఉన్న పురుషుల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి ప్రధానంగా దగ్గరి పరిచయం ద్వారా వ్యాపిస్తుంది.

African Swine Fever: కేరళలో మరో వైరస్ కలకలం.. పందులను చంపేయాలని ఆదేశం

ఈ సంవత్సరం ఇప్పటివరకు 70కి పైగా దేశాల్లో14 వేల కంటే ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వల్ల ఆఫ్రికాలో ఐదుగురు మరణించారు. ఈ వైరస్ స్వలింగ సంపర్కులకు వ్యాపించింది.యునైటెడ్ స్టేట్స్‌లో వెలుగుచూసిన 2,891 మంకీపాక్స్ కేసుల్లో 99శాతం పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న పురుషులకే ఎక్కువగా సోకిందని పాథాలజీ విభాగానికి చెందిన సీడీసీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జెన్నిఫర్ మెక్‌క్విస్టన్ తెలిపారు. న్యూయార్క్ నగరంలో అర్హులైన జనాభాలో సగానికి పైగా,వాషింగ్టన్ డీసీలో 70శాతం కంటే ఎక్కువ మందికి మొదటి వ్యాక్సిన్ మోతాదును అందించడానికి తగినంత టీకా ఇప్పటికే అందుబాటులో ఉందని వైట్ హౌస్ అధికారులు చెప్పారు. మంకీపాక్స్ వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలా వద్దా అని అమెరికా ఇంకా అంచనా వేస్తోందని వైట్ హౌస్ కోవిడ్-19 రెస్పాన్స్ కోఆర్డినేటర్ డాక్టర్. ఆశిష్ ఝా చెప్పారు.

Exit mobile version