Nancy Pelosi: నాన్సీ పెలోసీ ఇంట్లో ఆగంతుకుడి కలకలం.. ఆమె భర్తపై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nancy Pelosi: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ నివాసంలోకి ఓ ఆగంతుకుడు ప్రవేశించి ఆమె భర్తపై దాడి చేశాడు. శాన్ఫ్రాన్సిస్కో నగరంలోని ఇంట్లో ఉన్న ఆమె భర్త పాల్ పెలోసీ(82)పై దాడి చేసి గాయపరిచాడు. దాడి జరిగిన సమయంలో నాన్సీ పెలోసీ ఇంట్లో లేనట్లు తెలుస్తోంది. ఆయనపై దాడి అనంతరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పెలోసీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి గల కారణాలపై విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Indigo Flight: ఇండిగో ఫ్లైట్ ఇంజిన్లో చెలరేగిన మంటలు.. తప్పిన పెనుప్రమాదం
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఓ క్యాపిటల్ వెంచర్ సంస్థ నిర్వహిస్తున్నారు. ఆయనపై దాడికి గల కారణాలు ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. ఆ దుండగుడు ఓ సుత్తితో దాడికి పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఇంట్లోకి చొరబడిన అనంతరం అతడు నాన్సీ పెలోసీ కోసం వెతికినట్టు తెలుస్తోంది. ఆమె ఇంట్లో లేకపోవడంతో ఆమె భర్తపై దాడికి పాల్పడినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఇటీవల నాన్సీ పెలోసీ చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తైవాన్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆమె పర్యటన అనంతరం తైవాన్, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!