H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
H-1B Visa: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు, ముఖ్యంగా హెచ్-1బీ (H-1B) వీసాదారులకు కలవరం కలిగించేలా ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నాన్-ఇమిగ్రెంట్ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు ఉద్యోగం కోల్పోతే వారికి లభించే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను పూర్తిగా రద్దు చేసే దిశగా అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ రూపొందించిన ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షలో ఉంది. ఈ నిబంధన గనక అమల్లోకి వస్తే, ఉద్యోగం పోయిన వెంటనే కొత్త కొలువు వెతుక్కునేందుకు ఏమాత్రం సమయం ఉండదు. ప్రభావిత ఉద్యోగులతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా తక్షణమే అమెరికాను విడిచిపెట్టి స్వదేశానికి తిరిగి రావలసి ఉంటుంది.
చదువు, ఉద్యోగం, వ్యాపారం లేదా పర్యటన వంటి తాత్కాలిక అవసరాల కోసం వచ్చే విదేశీయులకు ఇచ్చే నాన్-ఇమిగ్రెంట్ వీసా విభాగంలో ఈ గ్రేస్ పీరియడ్ అత్యంత కీలకమైనది. 2017లో అమల్లోకి వచ్చిన ఈ నియమం ప్రకారం.. అనుమతి గడువు ముగియకముందే ఉద్యోగం ఊడిపోతే, విదేశీ ఉద్యోగులు మరొక కంపెనీలో చేరడానికి లేదా తమ వీసా హోదాను మార్చుకోవడానికి 60 రోజుల సడలింపు లభించేది. E-1, E-2, E-3, H-1B, H-1B1, L-1, O-1, TN వంటి ప్రధాన నాన్-ఇమిగ్రెంట్ వీసా హోల్డర్లకు ఇది పెద్ద ఊరటగా ఉండేది. ఈ సడలింపు సమయం కేవలం ఉద్యోగులకే కాకుండా, అమెరికన్ కంపెనీలకు కూడా కొత్త సిబ్బందిని నియమించుకోవడానికి లేదా ఉన్నవారి స్థానంలో మార్పులు చేయడానికి ఎంతో ఉపయోగపడేది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి ఈ సమయాన్ని తగ్గించే లేదా తిరస్కరించే అధికారం ఉన్నప్పటికీ, గతంలో చాలా అరుదుగా మాత్రమే ఆ అధికారాలను ఉపయోగించేవారు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఈ కొత్త ప్రతిపాదన భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా హెచ్-1బీ వీసాలను పొందుతున్న వారిలో మన భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఉదాహరణకు 2024 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన మొత్తం వీసాల్లో ఏకంగా 71 శాతం భారతీయులకే దక్కాయి. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 52 లక్షల (5.2 మిలియన్) మంది భారతీయ-అమెరికన్లు నివసిస్తున్నారు. అనుకోకుండా ఉద్యోగం కోల్పోయినప్పుడు ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్పైనే ఆధారపడి కొత్త అవకాశాలు వెతుక్కుంటున్న వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును ఈ ప్రతిపాదన తీవ్ర అభద్రతలోకి నెట్టివేస్తోంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!