america floods: అమెరికాలో హరికేన్ ఇయాన్ బీభత్సం సృష్టించింది. ఫ్లోరిడా తీరాన్ని తాకడంతో…. కుండపోత వర్షాలు, భారీగా వీస్తున్న గాలులు అట్లాంటిక్ తీర ప్రాంతాన్ని నాశనం చేశాయి. దేశ చరిత్రలో అత్యంత శక్తిమంతమైన ఈ తుపాన్ ధాటికి ఫ్లోరిడా రాష్ట్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. దక్షిణ కరోలినాపై కూడా ఇయన్ తన ప్రతాపం చూపింది. తుపాన్ధాటికి ఫ్లోరిడాలో 47మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వరద పోటెత్తడంతో ప్రజలు ఇళ్లల్లో భయంభయంగా గడుపుతున్నారు. విద్యుత్తు సౌకర్యం లేక, ఆహార పదార్థాలు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుపాను కారణంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం పట్ల ప్రధాని మోదీ ట్విట్టర్వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
ఫ్లోరిడాలో విధ్వంసం సృష్టించిన తరువాత దక్షిణ కరోలినా తీరప్రాంతంపై హరికేన్ తన ప్రతాపం చూపింది. చార్ల్‌స్టన్ నగరంలో భారీ వర్షాలుకు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. సముద్ర జలాలు వీధులను ముంచెత్తాయి. భీకర గాలుల వల్ల కొన్ని చోట్ల స్తంభాలు కూలిపోయాయి. శిథిలమైన ఇళ్లలో చిక్కుక్కున్న వారిని కాపాడేందుకు రక్షణ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరోవైతు వరదలకు గల్లంతైన తమ కుటుంబీకుల ఆచూకీ తెలపాలంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్ట్ చేస్తున్నారు. శనివారం నాటికి ఫ్లోరిడాలో 1,000 మందికి పైగా ప్రజలను అధికారులు కాపాడారు. దాదాపు 2.8లక్షల మంది అంధకారంలోనే ఉన్నారని అధికారులు తెలిపారు.
కరెంట్ సరఫరా పునరుద్ధరణ పూర్తి కావడంతో పరిస్థితి కాస్త మెరుగైంది. అమెరికాలో చరిత్రలో అత్యంత శక్తిమంతమైన హరికేన్లలో ఒకటిగానే కాదు.. భారీ స్థాయిలో ఆస్తి నష్టాన్ని కలిగించినవాటిలో ఒకటిగా ఇయన్ నిలుస్తోందని అధికారులు చెప్పారు. ఈ హరికేన్ వల్ల 10 వేల కోట్ల డాలర్లకుపైగా ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ఇయన్ తుపాను కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు.