H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
H-1B Visa: అమెరికాలో విదేశీ ఐటీ నిపుణులు, ముఖ్యంగా భారతీయులు ఎంతగానో ఎదురుచూసే హెచ్-1బీ (H-1B) వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొత్త హెచ్-1బీ వీసాల జారీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఏకంగా 1,00,000 డాలర్ల (దాదాపు రూ. 84 లక్షలు) భారీ రుసుమును మసాచుసెట్స్‌లోని బోస్టన్ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఈ నిబంధనను సవాలు చేస్తూ 20 రాష్ట్రాల డెమోక్రాటిక్ అటార్నీ జనరల్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ కీలక తీర్పునిచ్చారు. ట్రంప్ విధించిన ఈ భారీ రుసుము చట్టవిరుద్ధమైన పన్ను లాంటిదని, కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) అనుమతి లేకుండా ఇలాంటి పన్నులు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టం చేశారు. స్టేట్ డిపార్ట్మెంట్, యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఈ రుసుమును వసూలు చేయకూడదని ఆదేశించారు.
వాస్తవానికి.. గత సెప్టెంబర్‌లో ట్రంప్ ఈ వివాదాస్పద రుసుమును ప్రకటించారు. అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించే విదేశీయుల రాకను నియంత్రించే అధికారం వలస చట్టాల ప్రకారం అధ్యక్షుడికి ఉంటుందని, ఆ అధికారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వైట్ హౌస్ సమర్థించుకుంది. అమెరికన్ల ఉద్యోగాలను తక్కువ జీతాలకే వచ్చే విదేశీయులతో భర్తీ చేస్తూ హెచ్-1బీ ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. అయితే, కోర్టు మాత్రం దీనిని కేవలం రుసుముగా కాకుండా, చట్టవిరుద్ధమైన పన్నుగా తేల్చింది. జాతీయ అత్యవసర పరిస్థితుల పేరుతో గతంలో ట్రంప్ విధించిన టారిఫ్‌లను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని జడ్జి సోరోకిన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ తీర్పు ప్రకారమే ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని వాడుకుని పన్నులు వసూలు చేసే హక్కు అధ్యక్షుడికి ఉండదని స్పష్టం చేశారు. వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ మాత్రం ఈ తీర్పుపై పైకోర్టుకు వెళ్తామని, అప్పీలులో తమకే అనుకూలంగా నిర్ణయం వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Also Read
- Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
- CJP Protest: "4 గంటల సమయం దండగ".. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
ఇక, అమెరికా ఏటా 65,000 సాధారణ హెచ్-1బీ వీసాలతో పాటు, ఉన్నత చదువులు చదివిన వారి కోసం మరో 20,000 వీసాలను అందిస్తుంది. ఈ వీసాల కాలపరిమితి మూడు నుంచి ఆరేళ్ల వరకు ఉంటుంది. సాధారణంగా కంపెనీలు ఒక విదేశీ ఉద్యోగిని తీసుకోవడానికి 2,000 నుంచి 5,000 డాలర్ల వరకు మాత్రమే ఫీజు చెల్లిస్తాయి. అలాంటిది ట్రంప్ ఏకంగా లక్ష డాలర్ల ఫీజు పెట్టడంతో కంపెనీలకు భారం పెరిగింది. అయితే, అమెరికాలోనే ఉంటూ స్టూడెంట్ వీసాల ద్వారా హెచ్-1బీకి మారే పెద్ద సంఖ్యలో ఉండే అభ్యర్థులకు మాత్రం ఈ భారీ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ విపరీతమైన రుసుము వల్ల ఫిబ్రవరి 15 నాటికి కేవలం 85 మంది మాత్రమే ఈ ఫీజు చెల్లించినట్లు యూఎస్సీఐఎస్ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ భారీ రుసుముతో పాటు హెచ్-1బీ దరఖాస్తుల స్క్రీనింగ్‌ను కఠినతరం చేయడం, ఎక్కువ జీతాలు పొందే నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త ఎంపిక విధానాన్ని సైతం ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఈ లక్ష డాలర్ల ఫీజు నిర్ణయంపై అమెరికా వ్యాప్తంగా కనీసం మూడు వేర్వేరు వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ఇందులో యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను గత డిసెంబర్లో వాషింగ్టన్ డీసీ కోర్టు తిరస్కరించగా, వారు ఇప్పుడు ఆ తీర్పుపై అప్పీలుకు వెళ్లారు. తాజాగా బోస్టన్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ కేసును ముందుండి నడిపించిన కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా హర్షం వ్యక్తం చేశారు. ట్రంప్ విధించిన ఈ అక్రమ, ఖరీదైన పన్నును కోర్టు కొట్టేయడం శుభపరిణామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను అమెరికా ఆకర్షించకుండా, ఇక్కడి ఆర్థిక వ్యవస్థను మరియు శ్రామిక శక్తి అవసరాలను దెబ్బతీసేలా ఉన్న ట్రంప్ నిర్ణయానికి ఈ తీర్పుతో అడ్డుకట్ట పడిందని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
-
NBK 111 : షూటింగ్ లో బాలయ్య కు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!