Site icon NTV Telugu

Same Gender Marriage : ఇక స్వేచ్ఛగా స్వలింగ పెళ్లిళ్లు చేసుకోవచ్చు

Same Sex Marriage

Same Sex Marriage

Same Gender Marriage :స్వలింగ పెళ్లిళ్లకు అమెరికా ఆమోదం తెలిపింది. బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం పెట్టారు. దీంతో బిల్లు చట్టబద్ధమైంది. అమెరికా ప్రతినిధుల సభలో ఈ బిల్లు 258-169తో మెజార్టీతో ఆమోదం పొందింది. డెమొక్రాట్లతో పాటు 39 మంది రిపబ్లికన్ ప్రతినిధులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ఆ పార్టీకి చెందిన మరో 169 మంది బిల్లును వ్యతిరేకించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది. ఆయన ఆమోదం కోసం బిల్లును పంపినట్టు ప్రతినిధులు ఆయన ఆమోదించగానే చట్టంగా మారుతుంది.

Read Also: Bus Accident: బ్రేకులు ఫెయిల్.. హైవే పై ఆర్టీసీ బస్సు బీభత్సం

స్వలింగ వివాహాల బిల్లును నవంబర్ నెలలోనే సెనేట్ ఆమోదించింది. స్వలింగ, వర్ణాంతర వివాహాలు సమాఖ్య చట్టంలో పొందుపరచినట్టు ఈ బిల్లు నిర్ధారిస్తుంది. గత నెలలో సెనేట్ ఈ బిల్లును 61-36 ఓట్ల తేడాతో ఆమోదించిన తర్వాత వివాహ చట్టం కోసం ఓటింగ్ జరిగింది. ఓటింగ్ సమయంలో సెనేట్ డెమొక్రాట్లు, 12 మంది రిపబ్లికన్లు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేస్తూ 2015లో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఈ బిల్లును రూపొందించారు. ఫెడరల్ ప్రభుత్వం, రాష్ట్రాలు స్వలింగ, వర్ణాంతర వివాహాలను గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. ఈ బిల్లు 1996 డిఫెన్స్ ఆఫ్ మ్యారేజ్ చట్టాన్ని రద్దు చేస్తుంది.

Read Also: Bullet Train: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‎కు ఓకే చెప్పిన కోర్టు.. చెట్ల నరికివేతకు అనుమతి

Exit mobile version