H-1B Visa Fee: నిత్యం తన సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలింది. అన్ని కొత్త H-1B వీసా దరఖాస్తులపై US$100,000 రుసుము విధించాలనే ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ US చాంబర్ ఆఫ్ కామర్స్ దావా వేసింది. ట్రంప్ చర్య యూఎస్‌ను తప్పుదారి పట్టించే విధానంగా, అమెరికన్ ఆవిష్కరణ, పోటీతత్వాన్ని దెబ్బతీసేలా ఉందని, ఇది చట్టవిరుద్ధమని దావాలో పేర్కొంది.
READ ALSO: NIMS Tragedy: నిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి.. తప్పుదోవ పట్టిస్తున్న అధికారులు!
కొలంబియా కోర్టులో దావా..
కొలంబియా జిల్లా కోర్టులో గురువారం US చాంబర్ ఆఫ్ కామర్స్ దావా దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం సెప్టెంబర్ 19న ట్రంప్ పరిపాలన యంత్రాంగం కొంతమంది వలసేతర కార్మికుల ప్రవేశాన్ని నిషేధిస్తూ చేసిన ప్రకటనను సవాలు చేస్తుంది. H-1B వీసా కార్యక్రమాన్ని నియంత్రించే కాంగ్రెస్ అధికారాన్ని దాటవేయడం ద్వారా ఇమ్మిగ్రేషన్, జాతీయత చట్టాన్ని ఈ నిర్ణయం ఉల్లంఘిస్తుందని దావాలో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంలో హోంల్యాండ్ సెక్యూరిటీ, స్టేట్ విభాగాలు వాటి కార్యదర్శులు క్రిస్టి ఎల్. నోయెమ్, మార్కో రూబియోతో సహా ట్రంప్ పరిపాలన అధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. US చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ పాలసీ ఆఫీసర్ నీల్ బ్రాడ్లీ మాట్లాడుతూ.. H-1B వీసాపై ట్రంప్ విధించిన అధిక రుసుము, ప్రస్తుత US$3,600 కంటే ఎక్కువగా ఉండటం వలన అమెరికన్ యజమానులు, ముఖ్యంగా స్టార్టప్‌లు, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు H-1B ప్రోగ్రామ్‌ను ఉపయోగించడం మరింత ఖరీదైనదిగా మారుతుందని వెల్లడించారు.
ఫీజు పెంపు చట్టవిరుద్ధం.
చాంబర్ తన ఫిర్యాదులో.. అమెరికన్ వ్యాపారులు దేశంలో తమ కార్యకలాపాలను పెంచుకోవడానికి అవసరమైన ప్రపంచ నైపుణ్యాలను పొందేలా యూఎస్ కాంగ్రెస్ అమలు చేసిన చట్టాలను తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంగా ఉల్లంఘిస్తోందని దావాలో స్పష్టంగా పేర్కొంది. యూఎస్ ప్రభుత్వం ప్రకటన తప్పుదారి పట్టించే విధానం మాత్రమే కాదు, స్పష్టంగా చట్టవిరుద్ధం అని పేర్కొంది. అమెరికాలో పౌరులు కాని వారి ప్రవేశంపై అధ్యక్షుడికి గణనీయమైన అధికారం ఉందని, కానీ ఈ అధికారం చట్టం ద్వారా పరిమితం చేయడం జరిగిందని, అలాగే వలసలపై యూఎస్ కాంగ్రెస్ ఆమోదించిన చట్టాలను అధ్యక్షుడు కూడా ఉల్లంఘించలేరని చెప్పింది. “వీసా ఫీజులను పెంచుతూ ట్రంప్ పరిపాలన చేసిన ఈ ప్రకటన సరిగ్గా అదే చేస్తుంది. ఇది H-1B ప్రోగ్రామ్ కోసం కాంగ్రెస్ నిర్ణయించిన ఫీజులను స్పష్టంగా ఉల్లంఘిస్తుంది. అలాగే యూఎస్ కాంగ్రెస్ ఆదేశాన్ని తారుమారు చేస్తుంది” అని చాంబర్ పేర్కొంది.
H-1B హోదా పొందిన తర్వాత ప్రత్యేక రంగాలలో ప్రతి ఏడాది వేలాది మంది అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులు అమెరికా ఆర్థిక వ్యవస్థను పెంచుతారని చాంబర్ పేర్కొంది. ఈ H-1B హోదా పొందిన నిపుణులు ఆర్థిక వ్యవస్థలోని అన్ని పరిశ్రమలలో, అన్ని వ్యాపారాల వృద్ధికి మార్గం సుగమం చేస్తారని చెప్పింది. దీని ఫలితంగా వచ్చేవి మరిన్ని అమెరికన్ ఉద్యోగాలు, అధిక వేతనాలు, అమెరికన్ల జీవన నాణ్యతను మెరుగుపరిచే కొత్త ఉత్పత్తులు, సేవలను సృష్టిస్తాయని చెప్పారు. తాజాగా ట్రంప్ సర్కార్ జారీ చేసిన కొత్త ప్రకటన ఈ విధానాన్ని తారుమారు చేస్తుందని చాంబర్ ఫిర్యాదులో పేర్కొంది.
H-1B వీసాలపై అధిక మొత్తంలో రుసుములు విధించడం అమెరికా పోటీదారులకు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుందని చాంబర్ అభిప్రాయపడింది. ఈ నిర్ణయం నిస్సందేహంగా యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న వలస ప్రతిభను ఆకర్షిస్తుంది. ఇది విదేశీ యజమానులు ఎప్పటికీ తిరిగి పొందలేని పోటీ ప్రయోజనంగా పేర్కొంది. సెప్టెంబర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1-B వీసాల రుసుమును ఏటా US$100,000 (సుమారు రూ.88 లక్షలు) కు పెంచుతూ ఒక ప్రకటనపై సంతకం చేశారు. ఈ చర్య USలో వీసాలపై ఉన్న భారతీయ నిపుణులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. వలస సేవల సంస్థ (USCIS) నివేదికల ప్రకారం.. ఇటీవలి సంవత్సరాలలో ఆమోదించిన అన్ని H-1B దరఖాస్తులలో దాదాపు 71 శాతం భారతీయులవే. US తన వీసా విధానాన్ని కఠినతరం చేస్తుండగా, కంపెనీలు H-1B దరఖాస్తుదారులను స్పాన్సర్ చేయడానికి చెల్లిస్తాయి. ట్రంప్ నిర్ణయం వెలువడిన తర్వాత ఇటీవల చైనా K-వీసా అనే కొత్త వర్క్ పర్మిట్‌ను ప్రకటించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అర్హత కలిగిన నిపుణులు వాళ్ల దేశానికి వచ్చి పని చేయడానికి రూపొందించిది. K-వీసా యువ సైన్స్, టెక్నాలజీ ప్రతిభను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. ఇందులో మరొక విశేషం ఏమిటంటే దేశీయ యజమాని లేదా సంస్థ నుంచి ప్రతిభ ఉన్న వాళ్లకు ఎలాంటి ఆహ్వానం అవసరం లేదు.
READ ALSO: Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో సంచలనం.. నంద్యాలకు చెందిన విలేఖరి కీలక పాత్ర