Site icon NTV Telugu

North Korea: యూఎస్‌పై ఉత్తర కొరియా ప్రతీకారం.. రష్యాకు రహస్యంగా ఆయుధ సరఫరా!

North Korea

North Korea

North Korea: ఆఫ్రికాకు ఆయుధాలు రవాణా చేసే ముసుగులో ఉత్తర కొరియా రష్యాకు రహస్యంగా ఆయుధాలు సరఫరా చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ మేరకు ఉత్తర కొరియా ఆఫ్రికాకు సరఫరా చేస్తున్న ముసుగులో రష్యాకు గణనీయంగా ఆయుధ సామాగ్రిని పంపుతున్నట్లు యూఎస్‌ పేర్కొంది. అయితే రష్యా ఆ మందుగుండు సామాగ్రిని స్వీకరించిందో లేదో తెలియదు అని వైట్‌ హౌస్‌ జాతీయ ప్రతినిధి జాన్‌ కిర్బీ అన్నారు. యుద్దభూమిలో వినియోగించేందుకు ఉత్తర కొరియా నుంచి మిలియన్ల కొద్దీ రాకెట్లు, ఫిరంగి షెల్స్‌ను కొనుగోలు చేసే ప్రక్రియలో రష్యా ఉందని విశ్వసిస్తున్నట్లు యూఎస్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.

Russia-Ukraine War: రష్యాకు గట్టి ఎదురుదెబ్బ.. 24 గంటల్లో 1000 మంది సైనికులు మృతి

అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో రష్యా ఉత్తర కొరియా, ఇరాన్‌ల వైపు చూస్తోందని జాన్ కిర్బీ అన్నారు. ఉక్రెయిన్‌కు నిరంతర భద్రతా సహాయాన్ని అందించడానికి యూఎస్ కట్టుబడి ఉండటంతో ఇరాన్,ఉత్తర కొరియా నుంచి మద్దతు యుద్ధ గమనాన్ని మార్చదు అని కిర్బీ బుధవారం చెప్పారు .కానీ ఈ ఆయుధాలు ఇప్పుడు రష్యా తన యుద్ధ ప్రయత్నంలో ఒక ముఖ్యమైన భాగాన్ని బలపరచడానికి సహాయపడవచ్చు.. కానీ రష్యా ఇంకా ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. తాము ఆ మందు సామగ్రిని పర్యవేక్షించేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ఒక పక్క అమెరికా రష్యా ఉక్రెయిన్‌ మీద సాగిస్తున్న దురాక్రమణ చర్యకు ఆగ్రహంతో ఆంక్షలు విధించి ఉక్రెయిన్‌కు మిలటరీ సాయం అందిస్తోంది. మరోవైపు ఇదే సరైన సమయం యూఎస్‌పై పగ సాధించేందుకు అనుకుందో ఏమో ఉత్తర కొరియా పక్కగా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియాతో యూఎస్‌ చేసిన సైనిక కసరత్తులకు ప్రతిగా ఇలా ఉత్తర కొరియా తన ప్రతీకారం తీర్చుకుంటోందో ఏమో వేచి చూడాల్సిందే.

Exit mobile version