Site icon NTV Telugu

IPL 2025: నా ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ అదే: ఊర్వశి రౌతేలా

Urvashi Rautela

Urvashi Rautela

బాలీవుడ్‌ హీరోయిన్ ఊర్వశి రౌతేలా తన సినిమాలు, డేటింగ్ విషయంలో నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిస్తుంటారు. ముఖ్యంగా టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌తో డేటింగ్ విషయంలో తరచుగా వార్తల్లో ఉంటారు. ఊర్వశి, పంత్ మధ్య సంథింగ్ అంటూ గతంలో అనేక వార్తలు వచ్చాయి. ఊర్వశి కూడా ఓసారి తాను పంత్‌ కోసం చాలా సమయం వెయిట్ చేశానని స్వయంగా చెప్పారు. చాలాసార్లు సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు సెటైర్లు కూడా వేసుకున్నారు. అయితే ఐపీఎల్ 2025 సందర్భంగా మరోసారి ఇద్దరి పేర్లు చర్చకు వచ్చాయి.

ఐపీఎల్ 2025లో తన ఫేవరెట్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ అని ఊర్వశి రౌతేలా తెలిపారు. విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా తన సపోర్ట్ ఉంటుందని చెప్పారు. ఐపీఎల్ 2025లో లక్నో టైటిల్ గెలవాలని తాను కోరుకుంటునట్లు చెప్పారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ అని చెప్పిన ఊర్వశి.. ఇప్పుడు లక్నో అని చెప్పడానికి కారణం పంతే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జాట్’ ప్రమోషన్స్‌లో భాగంగా పంత్‌తో కలిసి పని చేయాలనుందనే తన కోరికను బయటపెట్టారు. పంత్‌తో యాడ్ చేయడం ఇష్టమేనా? అని ప్రశ్నకు ‘గతంలో నేను చాలా మంది క్రికెటర్లతో పని చేశాను. పంత్‌తో మాత్రం చేయలేదు. ఆ అవకాశం వస్తుందో లేదో తెలీదు. అది స్క్రిప్ట్‌పై ఆధారపడి ఉంటుంది’ అని బదులిచ్చారు. ప్రస్తుతం ఊర్వశి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: MI vs RCB: బుమ్రా వేసిన తొలి బంతికే ఫోర్‌ లేదా సిక్స్‌ కొడతా: టిమ్‌ డేవిడ్

ఊర్వశి రౌతేలాకు క్రికెట్ అంటే పిచ్చి. టీమిండియా మ్యాచ్‌లకు తరచుగా ఆమె హాజరవుతుంటారు. భారత జట్టుకు తన మద్దతు తెలుపుతారు. ఊర్వశితో డేటింగ్ వార్తలను పంత్ కొట్టిపారేశాడు. అయినా కూడా సమయం, సందర్భం వచ్చినపుడు పంత్ పేరును ఊర్వశి ప్రస్తావిస్తుంటారు. ఇక ‘సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన ఊర్వశి.. తెలుగులో వాల్తేరు వీరయ్య, ఏజెంట్‌, బ్రో, స్కంద చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేశారు. డాకు మహారాజ్ సినిమాలో కీలక పాత్రలో మెరిశారు.

Exit mobile version