NTV Telugu Site icon

Urfi Javed: ప్రైవేట్ జెట్ కొనేంతవరకు శృంగారంలో పాల్గొనను : ఉర్ఫీ జావెద్

New Project 2024 08 28t103749.275

New Project 2024 08 28t103749.275

Urfi Javed: విచిత్ర వేషధారణతో అందరినీ అలరిస్తున్న ఉర్ఫీ జావేద్ నిజ జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. ముఖ్యంగా ఉర్ఫీ జావేద్ జీవనశైలి మిగతా నటీమణులందరి కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె జీవిత నేపథ్యంలో ఓ వెబ్ షో కూడా రానుంది. దీని పేరు ఫాలో కర్లో యార్..ఈ షో ఆగస్టు 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రసారం కానుంది. ఇందులో ఉర్ఫీ నిజ జీవితానికి సంబంధించిన పూర్తి సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ షో ప్రమోషన్ కోసం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఈ విషయం గురించి చెప్పింది. సమంత, నేను ఇన్‌స్టాగ్రామ్ స్నేహితులం. జావేద్ తమ మధ్య ఉన్న రహస్య స్నేహాన్ని గురించి చెప్పుకొచ్చింది. సమంతకు నా వీడియో నచ్చితే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తుంది. దీని వెనుక ఎలాంటి ఉద్దేశం ఉందని నేను అనుకోవడం లేదని తెలిపింది.

Read Also:J-K Assembly Election: మొదటి దశకు 279 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు

ఈ సమయంలో ఆమె మరో విషయాన్ని ప్రస్తావించింది. తాను అర్జున్ కపూర్‌ని ప్రేమిస్తున్నానని చెప్పి షాక్ ఇచ్చింది. అందుకే ఉర్ఫీ జావేద్ తన అందంతోనే కాకుండా తన వింత వేషధారణతో కూడా ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ షో ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె రొమాన్స్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గత మూడేళ్లుగా సెక్స్‌కు దూరంగా ఉన్నానని, ఈ మూడేళ్లలో ఎవరితోనూ ముద్దులాట ఆడలేదని, కనీసం ఎవరితోనూ రొమాంటిక్‌గా మాట్లాడలేదని చెప్పింది. దీనికి గల కారణాన్ని నిర్భయంగా చెప్పింది. జీవిత భాగస్వామి కంటే తానేమీ తక్కువ కాకూడదని, జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. అంతేకాదు ప్రైవేట్ జెట్ కొనే వరకు ఎవరితోనూ రొమాంటిక్ గా కూడా మాట్లాడనని ఉర్ఫీ జావేద్ చెప్పింది. నిన్న ప్రమోషన్స్ లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Read Also:HYDRA Law: త్వరలో హైడ్రా చట్టం.. ఏ.వీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

Show comments