Site icon NTV Telugu

Chain Snatching: అప్‌డేట్ అయిన దుండగులు.. హైదరాబాద్‌లో కొత్తరకం చైన్ స్నాచింగ్!

New Chain Snatching

New Chain Snatching

తెలుగు రాష్ట్రాల్లో కొంత కాలంగా చైన్‌ స్నాచర్‌ రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. పట్టపగలే గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు మాస్కులు వేసుకొని బైక్‌పై వచ్చి.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళల మెడలోంచి బంగారంను ఎత్తుకెలుతున్నారు. మ‌హిళ‌ల మెడ‌ల్లో నుంచి పుస్తెలు తాడు లేదా చైన్స్ లాక్కెళ్లిన ఘటనలు భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్తరకం చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు.

Also Read: IND vs ENG: రసవత్తర ముగింపు దిశగా ఐదో టెస్ట్.. భారత్‌కు 4 వికెట్లు, ఇంగ్లండ్‌కు 35 పరుగులు!

ఇన్ని రోజులు బైక్‌పై వచ్చి దొంగతనాలకు పాల్పడిన దుండగులు.. కాస్త అప్‌డేట్ అయ్యారు. కొత్తగా కారుల్లో వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. నాలుగు రోజుల క్రితం కూకట్ పల్లి హోసింగ్ బోర్డులో ఇద్దరు దుండగులు కారుల్లో వచ్చి దొంగతనం చేశారు. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన నస్రత్ అలీ, అర్షద్ అహ్మద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. విచారణలో ఇతర ముఠాల గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Exit mobile version