NTV Telugu Site icon

PVCU3 : కొత్త ప్రాజెక్ట్ షురూ చేసిన ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ సంగతేంటి?

Prashanth Varma

Prashanth Varma

PVCU3 : హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా జాతీయస్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కేవలం రూ.40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 300కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ సినిమాతో ప్రశాంత్ తన పేరుతో ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) స్థాపించి అందులోనే వరుస సినిమాలు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కిస్తూ అందరి హీరోలకు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయారు. తాజాగా ఆయన ఈ యూనివర్స్ లో మరో కొత్త సినిమా రాబోతుంది అన్న క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

Read Also:Chiranjeevi: ఊటీలో కోట్లు పెట్టి ఖరీదైన స్థలం కొన్ని చిరంజీవి

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ మూవీని తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డాడు. ‘హనుమాన్’ మూవీ థియేటర్లలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించిన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసి ఈ సినిమా గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందన్న హామీ ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా తన సినీమాటిక్ యూనివర్స్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందని ప్రకటించారు. అక్టోబర్ 10 న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోందంటూ ప్రకటించిన ప్రశాంత్ వర్మ 24 సెకండ్ల నిడివి ఉన్న ఒక వీడియోను రిలీజ్ చేశారు. అందులో పెద్దగా డీటెయిల్స్ ఏమీ లేనప్పటికీ ఈ నవరాత్రికి శక్తి మాయాజాలాన్ని చూసేందుకు రెడీగా ఉండండి అంటూ తన సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు. మరి ఈ మూవీ టైటిల్ ఏంటి? నటీనటులు ఎవరు అన్న విషయాన్ని అక్టోబర్ 10న ఆయన ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

Read Also:Jagtial News: సార్ కాపాడండి.. ఇరాక్ లో జగిత్యాల యువకుడి ఆవేదన..

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ మీద నందమూరి మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యత కూడా ఉంది. కానీ మోక్షజ్ఞ సినిమా ఇంకా పట్టాలు ఎక్కక ముందే ప్రశాంత్ వర్మ తన యూనివర్స్ నుంచి మూడో సినిమా రాబోతుందని ప్రకటించడం చర్చకు దారి తీసింది. రీసెంట్ గా మోక్షజ్ఞ పుట్టిన రోజున ఆయన ఫస్ట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ప్రశాంత్ వర్మ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ కొత్త సినిమాను ప్రకటించడంతో మోక్షజ్ఞ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసాడా? అన్న అనుమానం వస్తుంది.

Show comments