Site icon NTV Telugu

Upcoming 5G Smartphones: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. నవంబర్‌లో లాంచ్ అయ్యే లిస్ట్ ఇదే!

Upcoming 5g Smartphones

Upcoming 5g Smartphones

అక్టోబర్ నెల ముగిసింది. గత నెలలో ఎన్నో అద్భుత స్మార్ట్‌ఫోన్‌లు రిలీజ్ అయ్యాయి. నవంబర్ మాసంలో కూడా టెక్ ప్రియులు పండగ చేసుకోనున్నారు. ఎందుకంటే టాప్ బ్రాండ్లు స్మార్ట్‌ఫోన్‌లు (కొత్త ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌) విడుదల కానున్నాయి. OnePlus, OPPO, iQOO, Realme.. కంపెనీలు ఈ నెలలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయబోతున్నాయి. నవంబర్‌లో ఏ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కాబోతున్నాయో, వాటి ఫీచర్లు ఏమిటో తెలుసుకుందాం.

OnePlus 15:
వన్‌ప్లస్‌ 15 సిరీస్ నవంబర్‌లో లాంచ్ కానుంది. లీకర్ పరాస్ గుగ్లానీ ప్రకారం..15 6.78-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో పెద్ద 7300mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. గ్లోబల్ లాంచ్ నవంబర్ 12న, భారతదేశంలో నవంబర్ 13న జరగనుంది.

OPPO Find K9:
ఒప్పో ఫైండ్ కే9 సిరీస్ నవంబర్ 18న లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. MediaTek Dimensity 9500 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 7025mAh బ్యాటరీ 80W వైర్డు, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతును పొందుతుంది.

Also Read: iQOO Neo 11: మరీ ఇంత బాగుందేందయ్యా ఈ స్మార్ట్‌ఫోన్.. చూస్తుంటేనే కొనాలనిపిస్తోంది!

iQOO 15:
ఐకూ 15 నవంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది 7000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, మూడు 50-మెగాపిక్సెల్ కెమెరాలను కలిగి ఉండనుంది.

Realme GT 8 Pro:
రియల్‌మీ జీటీ 8 ప్రో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 2K రిజల్యూషన్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచ్ అవనుంది. ఈ ఫోన్ గేమింగ్, అధిక పనితీరు గల వినియోగదారుల కోసం వస్తోంది. నథింగ్ ఫోన్ 3a లైట్, లావా అగ్ని 4 5G కూడా రిలీజ్ కానున్నాయి.

Exit mobile version