NTV Telugu Site icon

WPL 2025: WPL చరిత్రలో తొలి సూపర్ ఓవర్‌.. ఉత్కంఠపోరులో UP వారియర్స్ విజయం

Wpl 2025

Wpl 2025

WPL 2025: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2025లో సోమవారం నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), UP వారియర్స్ (UPW) మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్, ఫలితం సూపర్ ఓవర్‌లో వచ్చింది. ఈ మ్యాచ్ తో WPL చరిత్రలో తొలిసారిగా సూపర్ ఓవర్ జరిగింది. చివరికి సూపర్ ఓవర్ లో దీప్తి శర్మ నేతృత్వంలోని UP వారియర్స్ విజయం సాధించింది. స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్‌సిబి జట్టు మొదట 180/6 స్కోరు చేసింది. ఆ తర్వాత నిర్ణీత 20 ఓవర్లలో యూపీ 10 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. దీనితో మ్యాచ్ టై అయింది.

Read Also: Chhaava : ఛావా 11 రోజుల కలెక్షన్స్.. పుష్ప -2 రికార్డ్ జస్ట్ మిస్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ క్రికెటర్ సోఫీ కీలక పాత్ర పోషించింది. బ్యాట్‌తో మెరిసిన ఆమె ఆ తర్వాత సూపర్ ఓవర్‌లో బౌలింగ్ చేస్తూ 8 పరుగులు కూడా డిఫెండ్ చేసింది. సూపర్ ఓవర్‌లో ఆర్‌సిబి కేవలం 4 పరుగులు మాత్రమే చేయగలిగింది. 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో UP వారియర్స్ 11వ ఓవర్లో 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇందులో శ్వేతా సెహ్రావత్ 31 పరుగులు, దీప్తి 25 పరుగులు అందించారు. ఆ తర్వాత 17వ ఓవర్లో యూపీ స్కోరు 139/8 చేరుకోగా.. చివరి 18 బంతుల్లో యుపికి 42 పరుగులు అవసరం అయ్యింది. ఆ తర్వాత సోఫీ18వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టడంతో జట్టు స్కోరును 150 దాటించింది.

ఆ తర్వాత 19వ ఓవర్లో యుపికి 11 పరుగులు రాగా.. చివరి ఓవర్లో యుపికి 18 పరుగులు అవసరం కాగా 17 పరుగులు మాత్రమే సాధించింది. రేణుకా ఠాకూర్ సింగ్ వేసిన 20వ ఓవర్ నాల్గవ బంతికి సోఫీ మొదటి రెండు బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టింది. చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా.. క్రాంతి గౌడ్ ఒక పరుగు పూర్తి చేసి, రెండో పరుగుకు ప్రయత్నిస్తూ సోఫీ రనౌట్ అయ్యింది. సోఫీ 19 బంతుల్లో 33 పరుగులు సాధించింది. అంతకుముందు, ఎల్లీస్ పెర్రీ 90 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ఆర్‌సిబి భారీ స్కోరు చేసింది. పెర్రీ 56 బంతులలో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 90 పరుగులు సాధించింది. ఆ తర్వాత డానీ వ్యాట్ హాడ్జ్ 57 పరుగులతో కలిసి రెండో వికెట్ కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు తప్ప, మరే ఇతర RCB ఆటగాడూ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు.

Read Also: YSRCP vs Janasena: ఒంగోలులో వైసీపీకి బిగ్‌ షాక్.. ఏకంగా 20 మంది కార్పొరేటర్లు జనసేన వైపు..

ఇదిలా ఉండగా, సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ 8 పరుగులు సాధించి ఒక వికెట్ కోల్పోయింది. తక్కువ పరుగుల లక్షానికి వచ్చిన ఆర్‌సిబి సోఫీ వేసిన ఓవర్లో కేవలం 4 పరుగులకే పరిమితం కావడంతో UP వారియర్స్ విజయం అందుకుంది.