Zia ur Rahman Barq: ఉత్తరప్రదేశ్ లోని సంభాల్‌లో విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. విద్యుత్ మీటర్‌లో ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానంతో ఎంపీ జియావుర్ రెహమాన్ బుర్కే ఇంటిపై విద్యుత్ శాఖ బృందం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఎస్పీ శ్రీశ్‌చంద్ర, పోలీసు బలగాలు, ఆర్‌ఆర్‌ఎఫ్‌తో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంపీ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ కనెక్షన్లు, పరికరాలను బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. కరెంటు బిల్లు సున్నాకి ఎలా వచ్చిందో విషయంపై అధికారులు మీటర్లు తనిఖీ చేసారు. సుమారు గంటపాటు విచారణ అనంతరం బృందం తిరిగి వచ్చింది. అయితే సదరు ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ పోలీసు బలగాలు మోహరించాయి.
Also Read: Chess Dance: ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ ఆటకు తగ్గట్టుగా నాట్యం.. (వీడియో)
విద్యుత్ శాఖ పాత మీటర్లను ల్యాబ్ పరీక్షలకు పంపి ఇంటి వద్ద పకడ్బందీ కేబుల్‌తో కూడిన స్మార్ట్ మీటర్‌ను అమర్చింది. ఒక మీటర్‌పై జీరో లోడ్ ఉండగా, మరో మీటరుపై 5.9 కిలోవాట్ల లోడ్ నమోదైందని దర్యాప్తులో తేలింది. ఇక విషయం ఏంటంటే.. SP ఎంపీ ఇంటి వద్ద రెండు కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కొక్కటి నాలుగు కిలోవాట్ల కెపాసిటీ కలిగి ఉన్నాయి. గత ఏడాది కాలంలో ఈ రెండు కనెక్షన్లపై రూ.14 వేలు మాత్రమే విద్యుత్ బిల్లు వచ్చింది. రెండు కనెక్షన్‌ల మీటర్లు వేర్వేరు సమయాల్లో చాలా కాలం పాటు స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయని, దీని కారణంగా సున్నా రీడింగ్‌లు నమోదయ్యాయని పరిశోధనలో వెల్లడైంది. ఒక మీటరు ఐదు నెలలు, మరొకటి ఏడు నెలల పాటు స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: Leopard attack: చిరుతపులి దాడి.. యువతి మృతి
#WATCH | Sambhal, Uttar Pradesh: A team from State Electricity Department, along with a large number of security personnel, arrives at the residence of SP MP Zia ur Rehman Barq in Sambhal. The State Electricity Department has flagged irregularities in electricity usage at the… pic.twitter.com/Y8eLXbXf1M
— ANI (@ANI) December 19, 2024
దర్యాప్తు బృందం గంటపాటు క్షుణ్ణంగా విచారణ జరిపి అన్ని కనెక్షన్లు మరియు పరికరాలను పరీక్షించింది. విచారణ పూర్తి చేసిన అనంతరం ఎస్‌డిఎం డాక్టర్ వందనా మిశ్రా కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ నివేదిక ఆధారంగా విద్యుత్ శాఖ తదుపరి చర్యలు తీసుకోనుంది. అయితే, విద్యుత్ చౌర్యం కేసులో ఎంపీ జియావుర్ రెహమాన్ బుర్కే, అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మీటర్ తప్పుగా తేలితే విద్యుత్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవచ్చు. అలాగే, సోలార్ ప్యానెల్లు ఇంకా జనరేటర్ల వినియోగానికి సంబంధించి ఎంపీ అతని న్యాయవాది వివరణ ఇచ్చారు. అయితే, ఎంపీపీ ఇంటి వద్ద ఉన్న రెండు కనెక్షన్లకు అమర్చిన పరికరాలు, వినియోగం ప్రకారం ప్రతి నెలా కనీసం రూ.6వేలు బిల్లు రావాల్సి ఉందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. బిల్లులో ఇంత భారీ వ్యత్యాసం కనిపించడంతో ఆ శాఖ పాత మీటర్‌ను విచారణకు పంపింది. మీటర్లు తారుమారు అయ్యాయా అనేది విచారణలో తేలుతుంది. రెండు కనెక్షన్ల వినియోగంలో ఇంత వ్యత్యాసం ఎందుకు ఉందో ఇప్పుడు స్మార్ట్ మీటర్‌లో తనిఖీ చేయబడుతుంది. ఎంపీపీ కనెక్షన్‌పై ఐదు నెలలు, మరో కనెక్షన్‌పై ఏడు నెలలుగా జీరో యూనిట్లు నమోదయ్యాయి.