NTV Telugu Site icon

Gorakhpur Horror: ఆస్తి తగాదాలు.. తండ్రిని సుత్తితో చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి..

Gorakhpur Horror

Gorakhpur Horror

Gorakhpur Horror: మానవ సంబంధాలు మంటగాలిసిపోతున్నాయి. తండ్రిబిడ్డలు, తల్లి కొడుకుల సంబంధాలు సైతం కనుమరుగైపోతున్నాయి. పగలు ప్రతీకారాలు మాత్రమే రాజ్యమేలుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటు చేసుకున్న దారుణ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆస్తి తగాదాల కారణంగా తండ్రిని చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు ఓ కసాయి కొడుకు. కనిపెంచిన పాపానికి ఇలా తండ్రి రుణం తీర్చుకున్నాడు ఆ దుర్మార్గుడు. గోరఖ్‌పూర్‌ జిల్లా వాసి సంతోష్ కుమార్ గుప్తా (అలియాస్ ప్రిన్స్), ఆస్తి వివాదం కారణంగా అతని 62 ఏళ్ల తండ్రి మురళీ ధర్ గుప్తాను హత్య చేశాడు. హత్య తరువాత 30 ఏళ్ల నిందితుడు బాధితుడి మృతదేహాన్ని పారవేసేందుకు సూట్‌కేస్‌లో అమర్చడానికి ప్రయత్నించాడు. అందులో పట్టకపోవడంతో మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఈ ఘటన తివారిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరజ్ కుండ్ కాలనీలో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఆదివారం నిందితుడి సోదరుడు ప్రశాంత్ గుప్తా ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేశారు.

ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తన తండ్రిని చంపినందుకు ప్రిన్స్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితుడి భార్య కొవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయింది. మురళీధర్ గుప్తా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో జనరల్ స్టోర్ నడుపుతూ తన ఇంటి మొదటి అంతస్తులో ఉండేవాడు. బాధితుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు దాడి చేశాడు. బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆపై సోదరుడి గది నుండి సూట్‌కేస్ తెచ్చి మృతదేహం ముక్కలను సూట్‌కేస్‌లో ఉంచి ఇంటి వెనుక వీధిలో దాచాడు. మరో కుమారుడు ప్రశాంత్ గుప్తా ఓ పెళ్లికి వెళ్లి రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకోగా.. ఇంట్లో రక్తపు మరకలు కనిపించాయి. అనంతరం అతడు పోలీసులకు సమాచారం అందించాడు. అతడి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.

Read Also: Akhilesh Yadav: సీఎం పర్యటనకు వెళ్తే మాఫియా స్వాగతం పలుకుతుంది.. అఖిలేష్ సంచలన కామెంట్స్

నిందితుడి సోదరుడి సమాచారం మేరకు పోలీసులు శరీర భాగాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించారని అధికారి తెలిపారు. తదుపరి విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు. ఆస్తి విషయంలో తండ్రీకొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. నిందితుడు ఇటీవల కొనుగోలు చేసిన మోటార్‌సైకిల్‌కు నెలవారీ ఈఎంఐ చెల్లించేందుకు మురళీ ధర్ గుప్తా నిరాకరించడంతో శనివారం రాత్రి పరిస్థితి విషమంగా మారింది.