NTV Telugu Site icon

Delhi: పైలట్‌గా బిల్డప్.. ఎయిర్‌పోర్టులో హల్‌చల్.. చివరికిలా..!

Polite

Polite

కోటి విద్యలు కూటి కోసం అన్నారు పెద్దలు. అంటే బతకడానికి కోటి విద్యలు ఉన్నాయని చెప్పారు. అంటే అడ్డదారుల్లో సంపాదించమని కాదు. ఏ పని పడితే.. ఆ పని చేసి పైసలు సంపాదిస్తే పద్ధతిగా ఉండదు. ఆమోదయోగ్యంగా.. క్రమంగా సంపాదిస్తే.. దానికి వాల్యూ ఉంటుంది. అంతేకాని అక్రమ మార్గంలో వెళ్తే.. ఏదొక రోజు కటకటలు లెక్కట్టాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకుంటారా? అయితే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Allu Arjun : రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న పుష్ప..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఏకంగా పైలట్ అవతారం ఎత్తాడు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ పైలట్‌గా నటిస్తూ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో హంగామా సృష్టించాడు. అంతే.. పాపం పండి.. అడ్డంగా బుక్కయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌బుద్ధ నగర్‌కు చెందిన సంగీత్‌ సింగ్‌ (24).. 2020లో ముంబైలో ఒక సంవత్సరం ఏవియేషన్ హాస్పిటాలిటీ కోర్సును పూర్తి చేశాడు. అయితే సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక నకిలీ ఐడీ కార్డు సృష్టించి పైలట్‌గా చలామణి అవుతున్నాడు. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతగాడి బిల్డప్ కనిపెట్టిన పారామిలటరీ బలగాలు.. అదుపులోకి తీసుకుని విచారిస్తే బండారం బయటపడింది. అతని మెడలో ఉన్న కార్డు నకిలీదిగా గుర్తించారు.

ఇది కూడా చదవండి: Lok Sabha Elections: నామినేషన్ వేసేందుకు కాళ్ల వేళ్ల పడ్డ అభ్యర్థి.. అనుమతించని అధికారులు

సంగీత్ సింగ్.. పైలట్ యూనిఫాంలో ఎయిర్‌పోర్ట్ స్కైవాక్ దగ్గర అటూ ఇటూ తిరుగుతుండగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) గుర్తించింది. వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తే.. నకిలీ పైలట్‌గా తేల్చారు. పైలట్‌గా చెప్పుకుంటూ తన కుటుంబాన్ని కూడా తప్పుదారి పట్టించినట్లుగా గుర్తించారు. ఐడీ కార్డును మెడలో వేసుకుని తిరుగుతుండడంతో నిజమే అనుకుని కుటుంబ సభ్యులు నమ్మేశారు. ధ్రువీకరణ పత్రాలన్నీ పరిశీలించాక.. అవి నిజమైనవి కాదని తేల్చారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ కార్డును నకిలీదిగా చేసుకుని ఇలా తిరుగుతున్నాడు. ఇతగాడు వేసుకున్న దుస్తులను దేశ రాజధానిలోని ద్వారక ప్రాంతం నుంచి కొనుగోలు చేశాడు. సంగీత్ సింగ్‌ను పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Guinness World Record: ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. విశేషాలేంటంటే..

Show comments