Site icon NTV Telugu

Lakhimpur Violence: సుప్రీంలో కేంద్ర మంత్రి కుమారుడి బెయిల్‌ పిటిషన్‌.. వ్యతిరేకించిన యూపీ సర్కార్

Ashish Mishra

Ashish Mishra

Lakhimpur Violence Case: యూపీలోని లఖింపూరి ఖేరీలో చోటుచేసుకున్న హింసాకాండ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ లఖింపూర్ ఖేరీ హింస కేసులో నిందితుల్లో ఒకరైన కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడి బెయిల్ పిటిషన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది.ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌పై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేకే మహేశ్వరిలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టగా.. ప్రభుత్వం దానిని వ్యతిరేకిస్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్‌ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ గరిమా ప్రషాద్ చెప్పారు. ఆ నేరాన్ని ఘోరమైనదిగా, హేయమైనదిగా పేర్కొన్నారు. ఇది ఘోరమైన నేరమని.. సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతుందని అన్నారు.

BJP Resolution: ప్రధాని ఆధ్వర్యంలో ప్రపంచ భవిష్యత్‌కు రక్షకుడిగా భారత్.. బీజేపీ తీర్మానం

అక్టోబర్ 3, 2021న, లఖింపూర్ ఖేరీ జిల్లాలోని టికునియాలో అప్పటి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనను రైతులు నిరసిస్తున్నప్పుడు చెలరేగిన హింసలో ఎనిమిది మంది మరణించారు.ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎఫ్‌ఐఆర్ ప్రకారం, నలుగురు రైతులను ఎస్‌యూవీతో కొట్టి చంపారు. అందులో ఆశిష్ మిశ్రా కూర్చున్నారు. ఈ సంఘటన తర్వాత, ఆగ్రహం చెందిన రైతులు ఒక డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలను కొట్టారు. ఈ హింసాకాండలో ఓ జర్నలిస్టు కూడా చనిపోయాడు.

Exit mobile version