Site icon NTV Telugu

Tragedy : రీల్స్ చేస్తూ ఆరుగురు అమ్మాయిల మృతి

Insta Reels

Insta Reels

Tragedy : ఉత్తర ప్రదేశ్‌లోని నగ్లాస్వామి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికై యమునా నదిని సందర్శించిన ఆరుగురు యువతులు మృత్యువాత పడ్డారు. ఒక్క కుటుంబానికి చెందిన ఈ ఆరుగురు యువతులు అందమైన దృశ్యాలను క్యాప్చర్ చేయాలనే ఉద్దేశంతో నదిలోకి దిగారు. అయితే, ప్రమాదవశాత్తూ ఒక యువతి నీటిలో మునిగిపోవడం చూసిన మిగతా ఐదుగురు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారంతా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.

GHMC : జీహెచ్‌ఎంసీ బార్లకు దరఖాస్తుల వెల్లువ.. మరో మూడు రోజులే గడువు

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇందులో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన ఇద్దరిని తీవ్ర పరిస్థితిలో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వారు కూడా మరణించారని అధికారులు తెలిపారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇన్‌స్టా రీల్స్ మోజు ఒకే కుటుంబాన్ని చీకటిలో ముంచేసిందని స్థానికులు వాపోయారు.

MLC Kavitha : నేడు ఇందిరాపార్క్‌ దగ్గర తెలంగాణ జాగృతి ధర్నా

Exit mobile version