NTV Telugu Site icon

CM Yogi: కుక్కను తప్పించబోయి ఢీకొట్టిన సీఎం కాన్వాయ్.. పలువురికి గాయాలు

New Project (9)

New Project (9)

CM Yogi: లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ కంటే ముందు వెళ్తున్న యాంటీ డెమో వాహనం ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా ఓ కుక్క కారు ముందుకి రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పోలీసులు, ఆరుగురు పౌరులు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులందరికీ చికిత్స అందిస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ నుండి విమానంలో తిరిగి వచ్చి విమానాశ్రయం నుండి తన నివాసానికి వెళ్తున్నారు. అదే సమయంలో అతని కాన్వాయ్ ముందు నడుస్తున్న వాహనం యాంటీ-డెమో రహదారిని తనిఖీ చేస్తోంది. అర్జున్‌గంజ్ ప్రాంతంలోని మారి మాతా గుడి దగ్గర నుంచి కారు వెళ్తుండగా అకస్మాత్తుగా దారిలో ఓ కుక్క అడ్డు వచ్చింది. కుక్కను కాపాడే ప్రయత్నంలో ఉండగా వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వాహనాల్లో కూర్చున్న పోలీసులు, పౌరులు గాయపడ్డారు.

Read Also:Mixup : ఓటీటీలోకి వచ్చేస్తున్న బోల్డ్ మూవీ..ఆకట్టుకుంటున్న టీజర్..

లక్నో డీఎంతో పాటు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్ గాయపడిన వారి పరిస్థితిని తెలుసుకోవడానికి సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయనతో పాటు పోలీస్ కమిషనర్ లక్నో ఎస్పీ శిరాద్కర్ కూడా ఆసుపత్రిలో ఉన్నారు. జాయింట్ పోలీస్ కమిషనర్ ఉపేంద్ర కుమార్ అగర్వాల్ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం గాయపడిన మహిళలను ట్రామా సెంటర్‌కు తరలించారు. గాయపడిన వారిలో కొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. రోడ్డు మధ్యలో కుక్క అకస్మాత్తుగా కనిపించడంతో యాంటీ డోమో వాహనం అదుపు తప్పి సమీపంలో ఆగి ఉన్న పౌర వాహనాన్ని ఢీకొట్టింది. లులు మాల్ వైపు వెళ్తున్న రెండో వాహనంలో ఐదుగురు ఉన్నారు. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులందరినీ ట్రామా సెంటర్‌కు తరలించారు. గాయపడిన వారిని సెహ్నాజ్ (36), అక్సా (6), హస్నైన్ (1.5), నవేద్ (30), ముస్తకీమ్ (40) గా గుర్తించారు.

Read Also:Story Board: టీడీపీ-జనసేన వ్యూహమేంటి.? కమలం మదిలో ఏముంది..?