NTV Telugu Site icon

Revanth Reddy: ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్..! ప్రస్థానం మామూలుగా లేదుగా..

Revanth Reddy

Revanth Reddy

Revanth reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్‌ రెడ్డి ఓ సెన్సేషన్. ప్రత్యర్థులపై రేవంత్‌ రెడ్డి మాటలు విమర్శల దాడి చేస్తారు. ఆయన మైక్‌ పట్టుకుంటే చాలు తన స్పీచ్‌తో అగ్రెసివ్‌గా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. రేవంత్‌ పొలిటికల్ కెరీర్ 20 ఏళ్లు కూడా లేకపోయినా.. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కావటమే. అంతేకాదు కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలో అధికారంలోకి కూడా తీసుకొచ్చారు. జెడ్పీటీసీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు సీఎం రేసులో నిలిచారంటే ఆయన అంటే ఏంటో అందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అయితే రేవంత్‌ గురించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆయన పొలిటికల్ కెరీర్ గురించి చాలా మందికి తెలిసిందే కానీ.. ఆయన గతం గురించి, పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు రేవంత్‌ మాటలకు అందరూ ఫిదా అవుతున్నారు కానీ.. అప్పట్లో కూడా రేవంత్‌ మాటలు అందరిని అకట్టుకునేవట..

మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి ప‌ల్లిలో రేవంత్‌ రెడ్డి జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. రేవంత్‌ గ్రాడ్యుయేష‌న్ చ‌ద‌ువుతున్న స‌మ‌యంలో ABVP విద్యార్థి విభాగంలో స్టూడెంట్ లీడర్‌గా పనిచేశారు. అంతేకాదు ఆయన ఏవీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కొన్నాళ్ల పాటు ఓ పత్రికలో జర్నిలిస్టుగా పని చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 30 ఏళ్ల క్రితం “జాగృతి” అనే వార పత్రికలో పని చేస్తున్న సమయంలో రేవంత్‌ తీసుకున్న ఫోటో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఆ ఫోటోలో రేవంత్‌ తో పాటు ఓం ప్రకాష్ నారాయణ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ఫోటోను రేవంత్‌ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలో రేవంత్‌ బ్లాక్‌ కలర్‌ షర్ట్‌ వేసుకుని.. మొఖంపై ఆతేజస్సు, చిరునవ్వులు చిందిస్తూ 16 ఏళ్ల కుర్రాడిగా వున్న అందరిని ఆకట్టుకుంటోంది.

Read also: Yash 19 : యష్ 19 నుంచి అప్డేట్ వచ్చేసిందోచ్..టైటిల్ అనౌన్స్ అప్పుడే..

2004లో రేవంత్ తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారభించారు. అయితే.. 2006లో మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జెల్ జెడ్పీటీసీగా పోటీ చేశారు. కాగా.. టీడీపీ నామినేషన్ తిరస్కరించటంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు…ఆ తర్వాత 2008లో ఉమ్మడి ఏపీ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంఎల్‌సీగా విజయం సాధించి సంచలనం సృష్టించారు రేవంత్‌ రెడ్డి. ఇక..టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అంతేకాదు.. ఆ మరుసటి ఏడాదే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచి.. మళ్లీ 2014లోనూ కొడంగల్ నియోజకవర్గం నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి రేవంత్‌ విజయం సాధించారు.

ఆ.. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక.. 2019లో కాంగ్రెస్ నుంచి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి..2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు రేవంత్‌ రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు చేపట్టాక సీనియర్లు, జూనియర్లను కలుపుకొని ముందుకుసాగారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ప్రస్తుతం రేవంత్ సీఎం రేసులో ఉన్నారు. ఈరోజు తుది నిర్ణయం ప్రకటిస్తామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశంలో రేవంత్‌ రెడ్డి ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎమ్మెల్య్యేలు దానిని బలపరిచారు. రెండు మూడు గంటల్లోనే సీఎల్పీ నేత ఎవరనే దానిపై స్పష్టత రానుందని కాంగ్రెస్ సీనియర్‌ నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎవరు సీఎం అయినా సహకరిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
Udhayanidhi Stalin : ఎన్నికల తర్వాత మరోసారి సనాతన్ పై స్పందించిన ఉదయనిధి స్టాలిన్.. ఏమన్నాడంటే ?

Show comments