NTV Telugu Site icon

Unstoppable with NBK : అన్ స్టాపబుల్ తరువాత ఎపిసోడ్ పై హింట్ ఇచ్చిన ఆహా టీం..

Whatsapp Image 2023 11 11 At 6.26.54 Pm

Whatsapp Image 2023 11 11 At 6.26.54 Pm

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న పాపులర్ టాక్ షో ‘అన్‍స్టాపబుల్’కు ఎంతటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఇప్పటి వరకు ‘అన్‍స్టాపబుల్’ టాక్ షో రెండు సీజన్లు పూర్తి అయ్యాయి..ప్రస్తుతం అన్‍స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ ప్రసారమవుతుంది.. ఈ అన్‍స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ మొదటి ఎపిసోడ్‍లో భగవంత్ కేసరి మూవీ టీమ్ సందడి చేసింది. ఇక, అన్‍స్టాపబుల్ తదుపరి ఎపిసోడ్ గురించి ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (నవంబర్ 11) చిన్న హింట్ ఇచ్చింది. అన్‍స్టాపబుల్ నెక్ట్స్ ఎపిసోడ్ గురించి ఆహా నేడు ఓ ట్వీట్ చేసింది. “అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే అదిరిపోయే పాన్ ఇండియా ఎపిసోడ్ కోసం సిద్ధంగా ఉండండి” అని ఆహా పోస్ట్ చేసింది. వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. అయితే, అన్‍స్టాపబుల్‍కు యానిమల్ మూవీ టీమ్ రానుందని ఇప్పటికే లీక్‍లు వచ్చిన విషయం తెలిసిందే…

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరో గా నటిస్తున్నాడు రణ్ బీర్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు..యానిమల్ మూవీ ప్రమోషన్లలో భాగంగా రణ్‍బీర్, రష్మిక, సందీప్ రెడ్డి వంగా అన్‍స్టాపబుల్‍కు రానున్నారు. ఈ షోతో తెలుగులో ఆ చిత్రానికి మంచి క్రేజ్ వస్తుందని మూవీ యూనిట్ భావిస్తోంది. అలాగే, అన్‍స్టాపబుల్ షోకు బాలీవుడ్ హీరో రావడం కూడా ఇదే తొలిసారి అవడం విశేషం.సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ యానిమల్ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో రణ్‍బీర్ వైలెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్‌తో యానిమల్‍ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.యానిమల్ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ మరియు తృప్తి దిమ్రి కూడా కీలకపాత్రలు చేశారు.

https://twitter.com/ahavideoIN/status/1723240568619409588?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1723240568619409588%7Ctwgr%5E6077489ae3e564f5fafda482564b2926b2c1756f%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

Show comments