Unstoppable with NBK : అన్ స్టాపబుల్ తరువాత ఎపిసోడ్ పై హింట్ ఇచ్చిన ఆహా టీం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న పాపులర్ టాక్ షో ‘అన్‍స్టాపబుల్’కు ఎంతటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఇప్పటి వరకు ‘అన్‍స్టాపబుల్’ టాక్ షో రెండు సీజన్లు పూర్తి అయ్యాయి..ప్రస్తుతం అన్‍స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ ప్రసారమవుతుంది.. ఈ అన్‍స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ మొదటి ఎపిసోడ్‍లో భగవంత్ కేసరి మూవీ టీమ్ సందడి చేసింది. ఇక, అన్‍స్టాపబుల్ తదుపరి ఎపిసోడ్ గురించి ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (నవంబర్ 11) చిన్న హింట్ ఇచ్చింది. అన్‍స్టాపబుల్ నెక్ట్స్ ఎపిసోడ్ గురించి ఆహా నేడు ఓ ట్వీట్ చేసింది. “అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే అదిరిపోయే పాన్ ఇండియా ఎపిసోడ్ కోసం సిద్ధంగా ఉండండి” అని ఆహా పోస్ట్ చేసింది. వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. అయితే, అన్‍స్టాపబుల్‍కు యానిమల్ మూవీ టీమ్ రానుందని ఇప్పటికే లీక్‍లు వచ్చిన విషయం తెలిసిందే…
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరో గా నటిస్తున్నాడు రణ్ బీర్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు..యానిమల్ మూవీ ప్రమోషన్లలో భాగంగా రణ్‍బీర్, రష్మిక, సందీప్ రెడ్డి వంగా అన్‍స్టాపబుల్‍కు రానున్నారు. ఈ షోతో తెలుగులో ఆ చిత్రానికి మంచి క్రేజ్ వస్తుందని మూవీ యూనిట్ భావిస్తోంది. అలాగే, అన్‍స్టాపబుల్ షోకు బాలీవుడ్ హీరో రావడం కూడా ఇదే తొలిసారి అవడం విశేషం.సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ యానిమల్ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో రణ్‍బీర్ వైలెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్‌తో యానిమల్ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.యానిమల్ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ మరియు తృప్తి దిమ్రి కూడా కీలకపాత్రలు చేశారు.
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!