Unnao Rape Case: ఉన్నావ్ మైనర్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగర్‌కు సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో 2017లో జరిగిన మైనర్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సోమవారం సుప్రీంకోర్టు నిలిపివేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత, బాధితురాలు స్పందిస్తూ.. “సుప్రీంకోర్టు తీర్పు పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. సుప్రీంకోర్టు న్యాయం చేసింది. అయితే సెంగర్‌కు ఉరిశిక్ష పడేవరకు నా పోరాటం ఆగదు. అప్పుడే నా తండ్రికి, నాకు న్యాయం జరుగుతుంది. దేశ అత్యున్నత న్యాయస్థానంపై అపార విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు”.
READ ALSO: Karthi: ‘నీలకంఠ’ మూవీ ఘన విజయం సాధించాలి: హీరో కార్తీ
సీబీఐ తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు విన్న తర్వాత, సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పును వెలువరించింది. హైకోర్టు ఉత్తర్వుపై స్టే విధించింది. ‘మేము సాధారణంగా బెయిల్‌ను రద్దు చేయము, కానీ ఈ కేసు భిన్నంగా ఉంటుంది. ఆ వ్యక్తి ప్రస్తుతం మరో కేసులో జైలులో ఉన్నాడు. పోక్సోతో పాటు, ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 376(2)(I) కింద సెంగార్ దోషిగా నిర్ధారించబడ్డాడనే వాస్తవాన్ని ఢిల్లీ హైకోర్టు విస్మరించింది, హైకోర్టు తన నిర్ణయంలో ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై కుల్‌దీప్ సెంగర్‌కు కోర్టు నోటీసు జారీ చేసి, నాలుగు వారాల్లోగా స్పందన దాఖలు చేయాలి’ అని సుప్రీం కోర్టు ఆదేశించింది.
READ ALSO: Jagapathi Babu: జిత్తు టు అప్పలసూరి: జగ్గుభాయ్ విశ్వరూపం చూపిన రోల్స్ ఇవే
