NTV Telugu Site icon

Honour Killing : ప్రేమించడమే పాపమైంది… మామిడి తోటకు ఈడ్చుకెళ్లి కొట్టి చెట్టుకు ఉరితీశారు

Unnao

Unnao

Honour Killing : రోజురోజులకు ఆధునిక టెక్నాలజీ సాయంతో ఇతర గ్రహాల్లో జీవించాలని మానవుడు ప్రయత్నిస్తుంటే.. మరో వైపు ఈ కాలంలో కూడా పరువు అంటూ నిండు జీవితాలను నాశనం చేస్తున్నారు. 21వ శతాబ్ధంలోనూ పరువుహత్యలు జరుగుతుండడం కలవరపెట్టిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరో పరువు హత్య జరిగింది. అగ్రకులానికి చెందిన యువతి, దళిత యువకుడు ప్రేమించుకున్నారని వారిద్దరినీ అతి కిరాతకంగా చంపారు. ఈ దారుణంలో యువతి తండ్రితో పాటు బంధువులు హత్యలో పాలు పంచుకున్నారు. అనంతరం ఓ చెట్టుకు ఉరేసి వారిది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కానీ చేసిన పాపం ఊరికే పోదు అన్నట్లు అడ్డంగా దొరికిపోయారు.

Read Also:Adipurush: మరో కొత్త వివాదంలో ‘ఆదిపురుష్’! ఈ కర్ణుడి కష్టాలేంటో?

వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఉన్నావ్ జిల్లాకు చెందిన ఓ అగ్రకుల మైనర్ యువతి దళిత యువకుడు ఇద్దరు లవ్ చేసుకున్నారు. వీరి ప్రేమగురించి యువతి ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ల ప్రేమగురించి తెలియగానే ఆగ్రహం కట్టలుతెంచుకుంది. దీంతో యువతి కుటుంబసభ్యులు అత్యంత దారుణంగా వ్యవహరించారు. ముందు తమ అమ్మాయిని ప్రేమించిన దళిత యువకుడిని పట్టుకుని ఓ మామిడి తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ అతడిని దారుణంగా కొట్టిచంపారు. అనంతరం యువతిని కూడా అక్కడికి తీసుకువచ్చి అలాగే చంపేశారు.

Read Also:Sonakshi Sinha: నువ్వే కత్తిలా ఉంటావు.. నీ మెడలో మరోకత్తా సిన్హా..!

ఇలా ప్రేమజంటను హతమార్చి మృతదేహాలను ఓ చెట్టుకు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుక ప్రయత్నించారు. విషయం తెలిసి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీంతో వారిది ఆత్మహత్య కాదు హత్య అని తేలింది. దీంతో బాలిక కుటుంబసభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు గుర్తించారు. దీంతో యువతి తండ్రితో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అందులో నలుగురిని అరెస్ట్ చేసారు. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రేమజంటను హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Show comments