Unique Wedding : ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ జిల్లాలో విచిత్రమైన పెళ్లి జరిగింది. తన భర్తతో పదిమంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. సంవత్సరం కింద గ్రామం నుంచి అతడితో జంప్ అయింది. మళ్లీ ఏడాది తర్వాత స్వగ్రామానికి వచ్చి గ్రామస్తుల సమక్షంలో కోరుకున్న ప్రియుడిని పెళ్లి చేసుకుంది. అంతే కాకుండా గ్రామస్తులు పెళ్లి చేసి కొత్త దంపతులకు కానుకలు కూడా ఇవ్వడం విశేషం.
Read Also: Traffic restrictions: రేపు కొత్త సచివాలయ ప్రారంభోత్సవం.. ఆ రూట్లల్లో వెళ్లి పరిషాన్ అవ్వకండి
బహల్‌గంజ్ ప్రాంతానికి చెందిన సోనీ శర్మ(42).. మొదటి భర్త ఆరేళ్ల క్రితం చనిపోయాడు. కానీ, ఆమె అప్పటికే ఆమెకు పది మంది పిల్లలకు జన్మనిచ్చింది. భర్త చనిపోయాక సోనీ శర్మ.. అదే గ్రామానికి చెందిన బాలేంద్ర(40) అనే వ్యక్తితో ప్రేమలో పడింది. కానీ అతడిని వివాహం చేసుకోలేదు. ఏడాది క్రితం గ్రామం నుంచి వీరు వెళ్లిపోయి వేరే ప్రాంతంలో సహజీవనం చేస్తున్నారు. అప్పుడప్పుడు.. సోనీ శర్మ గ్రామానికి వచ్చిపోతుండేది. ఆ సమయంలో స్థానికులు.. పిల్లల బాగోగులు అడిగి తెలుసుకునేవారు. బాలేంద్ర, సోనీ ప్రేమ విషయం గ్రామంలో అందరికీ తెలుసు. దీంతో వారిద్దరికి పెళ్లి చేయాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు.. అంతేకాకుండా ఆ పది మంది పిల్లలకు అండగా ఉండాలనుకున్నారు.
Read Also:Abhilash Tomy: చరిత్ర సృష్టించిన సెయిలర్ అభిలాష్ టామీ.. ప్రీమియర్ గ్లోబల్ రేస్‌లో 2వ స్థానం
అదే గ్రామానికి చెందిన గురుకుల పీజీ కాలేజీ ప్రిన్సిపల్ జై ప్రకాశ్ షాహీ.. సోనీశర్మ, బాలేంద్రను పిలిచి పంచాయతీ పెట్టారు. ఇద్దరినీ ఒప్పించి స్థానిక శివాలయంలో వారికి పెళ్లి చేశారు. గ్రామస్థుల సమక్షంలో సోనీ, బాలేంద్ర ఒక్కటయ్యారు. సోనీ శర్మ పది మంది పిల్లలకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని పీజీ కళాశాల ప్రిన్సిపల్ జైప్రకాశ్ తెలిపారు. బాలేంద్ర, సోనీ శర్మకు తమ కాలేజీలో ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్లు చెప్పారు. దంపతులు కలిసి ఉండేందుకు ఉచితంగా వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.