NTV Telugu Site icon

Bihar: ఓటింగ్ రోజున విధ్వంసం.. కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై కాల్పులు

Bihar

Bihar

శనివారం బీహార్లో చివరి దశ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అయితే.. పోలింగ్ రోజున కేంద్రమంత్రి రామ్ కృపాల్ యాదవ్ కాన్వాయ్ పై దుండగులు గత రాత్రి తుపాకీ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు కేంద్రమంత్రి పాట్లీపుత్ర పార్లమెంటరీ నియోజకవర్గంలోని మసౌర్హి ప్రాంతంలో ఉన్నారు.

PM Modi : ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి 100రోజుల ప్రణాళికపై మోడీ భారీ సమావేశం

నివేదికల ప్రకారం.. స్థానిక ఆర్జేడీ (RJD) ఎమ్మెల్యే రేఖా పాశ్వాన్ నిన్న పోలింగ్ బూత్‌ను సందర్శించింది. ఈ క్రమంలో.. ఆమె సహాయకులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రామ్ కృపాల్ పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం.. తిరిగి వస్తుండగా ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగింది. అదృష్టవశాత్తు ఆయన కాన్వాయ్ లో లేకపోవడంతో బయటపడ్డాడు. ఘటనా స్థలంలో భారీ బలగాలు మోహరించి నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన పాట్నా-జెహనాబాద్ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో పార్టీ కార్యకర్త ఒకరు గాయపడ్డారని తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పాట్నా ఈస్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భరత్ సోనీ తెలిపారు.

Virat Kohli-ICC: ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ!

రామ్ కృపాల్ యాదవ్.. ఒకప్పుడు ఆర్జేడీ పితామహుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. అయితే.. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. 2014 నుండి పాటలీపుత్ర స్థానాన్ని గెలుచుకుంటున్నారు. ఈసారి యాదవ్ లాలూ యాదవ్ కుమార్తె, రాజ్యసభ ఎంపీ మిసా భారతితో పోటీ పడుతున్నారు. కాగా.. భారతి గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో యాదవ్ చేతిలో ఓటమిపాలయ్యారు.