Site icon NTV Telugu

Shobha Karandlaje: ఏప్రిల్ 17 భారత మహిళలకు ఒక బ్లాక్ డే..

Shobha

Shobha

Shobha Karandlaje: ఏప్రిల్ 17 భారత మహిళలకు ఒక బ్లాక్ డే అని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే అన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె ప్రసంగించారు. రాహుల్ మహిళలకు ధోకా ఇచ్చారని.. దక్షిణ భారత దేశ ప్రజలకు మోడీ మంచి చేయాలనుకున్నారన్నారు.. మోడీ మహిళల కోసం నారి వందన్ తెచ్చారన్నారు.. డీ లిమిటేషన్, మహిళా బిల్ తీసుకోచ్చారని గుర్తు చేశారు.. కానీ మహిళా బిల్ వీగిపోవడాన్ని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ సంబరాలు చేసుకుంకుందని.. అసలు కాంగ్రెస్ లక్ష్యం ఏంటి..? అని ప్రశ్నించారు. దేశాన్ని ముక్కలు చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని మండిపడ్డారు.. లోక్ సభలో అమిత్ షా గంట టైం ఇస్తే.. మీ సదేహాలు తీరుస్తా అన్నారని గుర్తు చేశారు.. కానీ మీరు ఎందుకు ఒప్పుకోలేదు.. మహిళా రిజర్వేషన్ వెనుక ప్రధాని పదేళ్ళ కృషి ఉందన్నారు.. బాలికలకు విదేశీ విద్య, స్కూల్స్, స్కాలర్ షిప్ ఇలా ఎన్నో మోడీ అందించారని చెప్పారు.. మన బాలికల శక్తి పెంచడానికి కృషి చేశారని.. మహిళల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. మోడీ ప్రవేశ పెట్టిన లోన్స్ తో 3 కోట్ల మహిళలు లక్షది పతులు అయ్యారన్నారు. మహిళలు ఇంటికే పరిమితం అవ్వకూడదని మోడీ అనుకున్నారు.. ఒకప్పుడు బాలికలను ఉన్నత చదువులకు పంపే వాళ్ళం కాదని నాటి పరిస్థితులను వివరించారు. హాస్టల్‌లో ఉంచే వాళ్ళం కాదు.. ఉద్యోగానికి పంపే వాళ్ళం కాదు.. కేవలం పెళ్లి చేసి అత్తవారింటికి పంపేవాళ్ళమన్నారు. కానీ ఇప్పుడు ఆలా కాదు.. ఉన్నత చదువులకు మహిళా విదేశాలకు వెళ్తుందని తెలిపారు..

READ MORE: Silver Purity: పాపం తెలుసా.. వెండి కొంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారంట! ఎలాగో తెలుసా?

“మహిళ విమానం నడుపుతుంది.. ఉద్యోగం చేస్తుంది. ఇదంతా మోడీ ప్రధాని అయ్యాకే జరిగింది.. దక్షిణ భారత దేశానికి అన్యాయం చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.. కానీ మహిళా బిల్ విషయంలో దక్షిణ భారత దేశానికి అన్యాయం చేసింది వాళ్లే.. ఇప్పుడు ఉన్న ఎంపీ సీట్లను 50 శాతం పెంచుతామని లోక్ సభ సాక్షిగా అమిత్ షా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం పార్టీ మహిళలు సైతం మహిళా బిల్ పాస్ అవుతుందా? అని అడిగారు. ఎందుకంటే వాళ్లకు కూడా వాళ్ల పార్టీలో అవకాశాలు దొరుకుతాయని అనుకున్నారు. కానీ.. లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రవర్తన అందరు గమనించారు.. ప్రతిపక్ష నేతగా ఏం మాట్లాడాలో ఆయనకు తెలియదు. ఎవరైనా ఆయనకు చెప్పండి ఏం మాట్లాడాలో. ఇండియా కూటమి నల్ల బట్టలతో నిరసన చేశారు. ఏం చేయాలని మీ ఉద్దేశం..? ఇంకా ఎన్నాళ్ళు ఒక మహిళ ఎంపీ కాకుండా ఎమ్మెల్యే కాకుండా వేచి ఉండాలి. మహిళలను ఉన్నత స్థానంలో కూర్చోపెట్టాలని మోదీ అనుకున్నారు. తెలంగాణలో మహిళలకు 2500 ఇస్తామని ఎందుకు ఇవ్వలేదు. విద్యార్థినిలకు స్కూటీ ఇస్తామని అన్నారు. ఎందుకు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి చెప్పాలి. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఎన్నో హామిలిచ్చింది. కానీ నెరవేర్చడంలో విఫలం అయ్యింది. కర్ణాటకలో ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్పి 20 శాతం కూడా బస్సులను అందించడం లేదు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లి చేసుకున్న వారికి తులం బంగారం ఇస్తానని తెలంగాణలో ప్రకటించారు. తెలంగాణాను రేవంత్ రెడ్డి చీట్ చేశారు.” అని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వ్యాఖ్యానించారు.

Exit mobile version