NTV Telugu Site icon

Rammohan Naidu : బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రభావం.. ఇప్పటికే 15వేల కోట్లు..

Rammohan Naidu

Rammohan Naidu

బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రభావం ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడు నెలలుగా రాష్ట్రంలోని సమస్యలను కేంద్రానికి చెప్పారని తెలిపారు. వాటికి కేంద్ర బడ్జెట్ ద్వారా పరిష్కారమయ్యాయన్నారు. జల్‌జీవన్ మిషన్ ప్రధానికల నిజం కాకుండా గత సర్కార్ చేసిందని విమర్శించారు. జల్‌జీవన్ మిషన్ ను పొడిగించారని చెప్పారు. మాన్యుఫాక్చర్ రంగంలో ఏపీకి మేలు జరగనుందని స్పష్టం చేశారు ఉడాన్ స్కీంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సివిల్ ఏవియేషన్ రంగంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని కొనియాడారు. ఉడాన్ స్కీం 120 కొత్త డెస్టినేషన్ లకు కనెక్ట్
చేసేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు.

READ MORE: Kethireddy Venkatarami Reddy: చిరంజీవి, పవన్‌, బాలయ్యపై కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

“ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు. గడిచిన 7 నెలల్లో అమరావతికి 15 వేల కోట్లు వచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 16440 కోట్లు కేంద్రం ఇచ్చింది. పోలవరం కోసం 12 వేల కోట్లు ఇవ్వనున్నారు. వ్యవసాయం, సామాన్యుడికి, msme లకు కేటాయింపులు జరిగాయి. రైతులు, సీ ఫుడ్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏపీ. రాయలసీమకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నారు. జల్ జీవన్ మిషన్ ను ఏపీలో పొడిగించాలని కోరాం. 2028 వరకు పొడిగించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా టూ టైర్, త్రీ టైర్ నగరాలకు నిధులు రానున్నాయి. క్యాన్సర్ కు సంబంధించిన 36 మందుల పై టాక్స్ తగ్గించారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. బడ్జెట్ సింహ భాగం ఏపీకి దక్కుతుంది. పోలవరం, అమరావతికి నిధులు కేటాయించారు. విశాఖ స్టీల్ విషయంలోను నిధులు సాధించుకున్నాం.” అని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు స్పష్టం చేశారు.

READ MORE: Thandel: ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని ప్రకటించిన చిత్ర బృందం.. పోస్ట్ వైరల్