Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. ఆయనకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. పండితుల వేద ఆశీర్వచనం అనంతరం అధికారులు లడ్డు ప్రసాదం అందజేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుని పలు కార్యక్రమాలను మొదలు పెడుతున్నానని ఆయన అన్నారు.
Minister Roja: బర్త్ డే వేళ శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా
తెలంగాణలో గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది.. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని మర్చిపోయారని కేంద్ర మంత్రి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ కుటుంబ సభ్యులపై తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ పని చేసుకోవడానికి తగిన శక్తిని ప్రసాదించమని స్వామివారిని కోరుకున్నానన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని మొత్తం భూస్థాపితం చేసి.. తెలంగాణ ప్రజలు బీజేపీని అధికారంలోకి తెచ్చి మోడీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలని కోరుకుంటున్నానని ఆయన వెల్లడించారు.